మెగా పవర్ స్టార్ రాంచరణ్ (Ram Charan) హీరోగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ తెలుగులో చేసిన మొదటి సినిమా ‘గేమ్ ఛేంజర్’ (Game Changer). టాలీవుడ్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించాడు. రాంచరణ్ డ్యూయల్ రోల్ చేసిన ఈ సినిమాలో అంజలి, కియారా అద్వానీ..లు హీరోయిన్లుగా నటించారు. తమన్ సంగీతంలో రూపొందిన పాటలకి పర్వాలేదు అనిపించే రెస్పాన్స్ వచ్చింది. విజువల్ గా ఎలా ఉంటాయో అనే ఆసక్తిని కలిగించాయి.
Game Changer First Review
జనవరి 10న సంక్రాంతి కానుకగా.. అంటే మరికొన్ని గంటల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆల్రెడీ ఇండస్ట్రీకి చెందిన కొందరు పెద్దలు.. ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) ని వీక్షించడం జరిగింది. వారు తమ అభిప్రాయాలను కూడా షేర్ చేసుకున్నారు. వారి టాక్ ప్రకారం.. ‘ఒక ఐఏఎస్ ఆఫీసర్ కి మినిస్టర్ మధ్య జరిగిన పోరు ఈ సినిమా కథ’ అని అంటున్నారు. పోలీస్.. ఐపీఎస్ గా(చరణ్) ఉండే హీరో తర్వాత ఆ జాబ్ మానేసి ఎందుకు ఐఏఎస్ ఆఫీసర్ రామ్ నందన్ అవతారం ఎత్తాడు? అసలు.. రామ్ తండ్రి అప్పన్న(చరణ్) ఎవరు? అతనికి వెన్నుపోటు పొడిచింది ఎవరు? అనే అంశాలతో ఈ సినిమా రూపొందినట్లు తెలుస్తుంది.
హీరో ఇంట్రో ఫైట్, ఐ.ఏ.ఎస్ అయిన తర్వాత ప్రభుత్వ ఆఫీస్ వద్ద వచ్చే ఫైట్.. మాస్ ఆడియన్స్ కి మంచి ఫీస్ట్ ఇస్తాయట. మాస్ ఎలిమెంట్స్ కూడా ఈ సినిమాలో గట్టిగానే ఉంటాయట.విలన్ ఎస్.జె.సూర్య కూడా హీరోకి ఎక్కడా తగ్గకుండా నటించాడని అంటున్నారు. సెకండాఫ్ లో వచ్చే కొన్ని ఎలిమెంట్స్ మంచి హై ఇస్తాయట.
‘నానా హైరానా’ ‘జరగండి’ ‘దోప్’ వంటి పాటలు విజువల్ గా మెప్పిస్తాయట. తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుందని అంటున్నారు.బుర్రా సాయి మాధవ్ రాసిన డైలాగులు కూడా బాగా పేలాయి అని అంటున్నారు. మరి మిడ్ నైట్ షోల నుండి ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి..