మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘గేమ్ ఛేంజర్’ సినిమా ఈరోజు అనగా జనవరి 10 న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. జనవరి 10, జనవరి 11న ఈ సినిమాకి సోలోగా క్యాష్ చేసుకునే చాన్స్ దక్కించుకుంది. టాక్ కొంచెం మిక్స్డ్ గా వచ్చింది. అయినప్పటికీ కొన్ని చోట్ల బుకింగ్స్ బాగున్నాయి. మాస్ ఏరియాల్లో నైట్ షోలకి బుకింగ్స్ బాగానే జరుగుతున్నాయి.మరీ పుష్ప 2 రేంజ్లో లేవు కానీ..
Game Changer
మొదటి రోజు మంచి వసూళ్లు వచ్చే ఛాన్స్ ఉంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా తమిళనాడు , కర్నాటక, హిందీ వంటి ఏరియాల్లో బుకింగ్స్ బాగున్నాయి. ఓవర్సీస్ మాత్రం అనుకున్న స్థాయిలో లేవు. ఇక ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం…’గేమ్ ఛేంజర్’ సినిమా మొదటి రోజు రూ.60 కోట్ల వరకు షేర్ ను కలెక్ట్ చేసే అవకాశం ఉంది.
ఆఫ్ లైన్ బుకింగ్స్ వంటివి లెక్కలు పెరిగితే మొదటి రోజు రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వచ్చే అవకాశం ఉంటుంది.మిక్స్డ్ టాక్ తో ఈ రేంజ్ ఓపెనింగ్స్ అంటే చిన్న విషయం కాదు. మరి ఆఫీషియల్ లెక్కలు ఎంతవరకు ఉందంటున్నాయో చూడాలి. ఇక రామ్ చరణ్ కెరీర్ లో మొదటి రోజు వంద కోట్లు కలెక్ట్ చేసిన సినిమాగా ‘ఆర్.ఆర్.ఆర్’ మాత్రమే ఉంది. మరి ఆ సినిమా తర్వాత ‘గేమ్ ఛేంజర్’ వంద కోట్ల మార్క్ చేరుకుంటాడేమో.. మరికొన్ని గంటల్లో తెలుస్తుంది.