మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ భారీ అంచనాలతో సంక్రాంతి బరిలోకి దిగింది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో విడుదలైన ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ పై అభిమానుల్లో భారీగా ఆసక్తి నెలకొంది. దిల్ రాజు బ్యానర్ పై అత్యంత ఖర్చుతో నిర్మించిన ఈ సినిమా కథనంపై ప్రేక్షకులలో మిశ్రమ స్పందన రావడం గమనార్హం.
Game Changer
రాజమౌళి తన కుటుంబంతో కలిసి హైదరాబాద్‌లోని అపర్ణ సినిమాస్‌లో గేమ్ ఛేంజర్ చూశారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయనతో పాటు సతీమణి రమా రాజమౌళి, కుమారుడు కార్తికేయ, సంగీత దర్శకుడు కీరవాణి కుటుంబ సభ్యులు ఈ ప్రదర్శనకు హాజరయ్యారట. సినిమా ముగిసిన తర్వాత రాజమౌళి ఏమంటారో అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్.
గేమ్ ఛేంజర్ పై వస్తున్న మొదటి ప్రశంసలు, విమర్శలు కలిపి ఓ మిశ్రమ అనుభవాన్ని ఇస్తున్నాయి. మెగా ఫ్యాన్స్ రామ్ చరణ్ నటన, సినిమా విజువల్స్ ను పొగుడుతుండగా, కథా తీరులో కొత్తదనం లేకపోవడంతో జనరల్ ఆడియన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సినిమాకు సంబంధించిన సెకండాఫ్ గురించి విమర్శకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇండస్ట్రీలో ఉన్న ‘రాజమౌళి బ్యాడ్ సెంటిమెంట్’ గురించి కూడా చర్చ జరుగుతోంది.
రజమౌళితో పని చేసిన హీరోలు ఆ తర్వాతి సినిమాలు ఆశించిన స్థాయిలో నిలవకపోవడం వల్ల ఈ అభిప్రాయం వచ్చింది. ఎన్టీఆర్ ఈ సెంటిమెంట్‌ను దేవరతో చెరిపేయగా, రామ్ చరణ్ మాత్రం ఆచార్యతో ఎదురుదెబ్బలు తిన్నారు. ఈ నేపథ్యంలో గేమ్ ఛేంజర్ విజయం కీలకంగా మారింది. ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటించగా, ఎస్‌జె సూర్య, అంజలి, శ్రీకాంత్ వంటి ప్రతిభావంతులు కీలక పాత్రలు పోషించారు. థమన్ సంగీతం అందించిన ఈ సినిమాను బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాలు అందిస్తుందో చూడాలి.