హీరోలకి, అభిమానులకి మాత్రమే కాదు నిర్మాతలకి కూడా పీడకలల్లాంటి సినిమాలు ఉంటాయి. స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ (C. Aswani Dutt) గారికి అలాంటి సినిమాలు ఎన్నో ఉన్నాయి. అన్నీ ఎలా ఉన్నా.. ఈయన దేవుడిపై సినిమా తీస్తే ఫలితం తేడా కొట్టేస్తూ ఉండేది. ‘కల్కి 2898 AD’ తో (Kalki 2898 AD) ఆ సెంటిమెంట్ బ్రేక్ అయినా.. ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే అసలు మేటర్ తెలుస్తుంది. ఎన్టీఆర్ తో (Jr NTR) చేసిన ‘శక్తి’ (Sakthi) కావచ్చు అంతకు ముందు నాగార్జునతో (Nagarjuna) చేసిన ‘గోవిందా గోవిందా’ (Govinda Govinda) కావచ్చు.. అశ్వినీదత్ గారికి పీడకలల్లాంటి సినిమాలే అని చెప్పాలి. నేటితో ‘గోవిందా గోవిందా’ సినిమా 31 ఏళ్ళు పూర్తి చేసుకుంటుంది. 1994 జనవరి 21న ఈ సినిమా రిలీజ్ అయ్యింది.
Govinda Govinda
1) రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma) సూపర్ ఫామ్లో ఉన్న రోజులవి. అతను అశ్వినీదత్ కి 2 కథలు చెప్పారు. అందులో ఒకటి ‘రంగీలా’.. ఇంకోటి ‘గోవిందా గోవిందా’.
2) ఈ 2 సినిమాల్లో అశ్వినీదత్ కి ‘రంగీలా’ కథ బాగా నచ్చింది. ఈ సినిమాని చిరంజీవి (Chiranjeevi), రజినీకాంత్ (Rajinikanth), శ్రీదేవి (Sridevi) .. వంటి స్టార్స్ తో చేస్తే బాగుంటుంది అని అశ్వినీదత్ అనుకున్నారట. కచ్చితంగా అది హిట్ అవుతుంది అని అశ్వినీదత్ పసిగట్టారు.
3) కాకపోతే రజినీకాంత్, చిరంజీవి, శ్రీదేవి వంటి స్టార్స్ తో.. అలాంటి ముక్కోణపు ప్రేమకథ చేస్తాను అంటే.. వాళ్ళు ఒప్పుకుంటారా? పైగా హీరోలకి ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఉండదు. ఇలాంటి ఆలోచనలే అశ్వినీదత్ గారిని వెనక్కి లాగేసాయట.
4) ఇలాంటి సందిగ్ధంలో అశ్వినీదత్ ‘గోవిందా గోవిందా’ కథని ఓకే చేశారట. తిరుమల శ్రీవారికి(శ్రీ వెంకటేశ్వర స్వామి) అలంకరించిన కిరీటాన్ని.. ఓ ముఠా దొంగతనం చేయడానికి ప్లాన్ చేయడం. ఈ క్రమంలో హీరో ద్వారా దేవుడు తన విగ్రహాన్ని తిరిగి రప్పించుకోవడం అనే లైన్.. కచ్చితంగా ఆడియన్స్ కి నచ్చుతుందేమో అని అశ్వినీదత్ అనుకున్నారట. నిజమే.. ఆయన ఐడియా మంచిదే.
5) నాగార్జున ‘శివ’ తో (Siva) ఇండస్ట్రీ హిట్ కొట్టి సూపర్ ఫామ్లో ఉన్నాడు. హీరోయిన్ శ్రీదేవి క్రేజ్ కూడా రాష్ట్రాలు దాటింది. ఈ కాంబోలో మూవీ చేస్తే తిరుగుండదు అని అంతా అశ్వినీదత్ అనుకున్నారు. ఆ మొండి ధైర్యంతోనే సెట్స్ కి వెళ్లిపోయారు.
6)’గోవిందా గోవిందా’ అనే టైటిల్ కి ముందు ‘వెంకటేశ్వర స్వామి గుడిలో దొంగలు పడ్డారు’ ‘శ్రీవారి కిరీటం’ వంటి ఏవేవో టైటిల్స్ అనుకున్నారట. ఫైనల్ గా ‘గోవిందా గోవిందా’ అనే టైటిల్ కి ఫిక్స్ అయ్యారు.
7)షూటింగ్ మొదలయ్యాక ఈ సినిమాకి అనేక అవాంతరాలు ఎదురయ్యాయి. శ్రీదేవి డేట్స్ అడ్జస్ట్ అయ్యేవి కావట. ఆమె ఆ టైంలో అంత బిజీగా ఉండేది. కాంబినేషనల్ సీన్స్ తీయడానికి చాలా ఇబ్బంది పడేవారట. దీంతో రాంగోపాల్ వర్మ ఇరిటేట్ అయిపోయి చాలా సార్లు షూటింగ్ క్యాన్సిల్ చేశారట.
8)సినిమాకి కోసం అనుకున్న బడ్జెట్ మొదటి 15 రోజుల్లోనే మించి పోయిందట. అశ్వినీదత్ కాబట్టి వెనకడుగు వేయకుండా ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్లారు.
9) అప్పట్లో సినిమా వార్తలు ఆదివారం మ్యాగ్జైన్స్ లో వచ్చేవి. అలా ఈ సినిమా స్టోరీ లైన్ బయటకి వచ్చాక.. చాలా మంది హిందూ పండిట్లు, హిందూ సంఘాల వారు నిరసన వ్యక్తం చేశారట. వాళ్ళు కేసులు వేయడం .. అశ్వినీదత్ పోలీస్ స్టేషన్ మెట్ల చుట్టూ తిరగడం వంటివి కూడా చేశారట. అవన్నీ ఉపసంహరించుకునేలా చేయడం అతనికి చాలా తలనొప్పి అయ్యిందట.
10) మొత్తానికి కిందా మీదా పడి సినిమాని కంప్లీట్ చేసి రిలీజ్ చేశారు. ఆ టైమ్లో కూడా చాలా గొడవలు. ఈ సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని చాలా మంది నిరసన చేశారు. ఇన్ని గొడవల్లో కొట్టుకుపోయిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కోలుకోలేదు. దీంతో అశ్వనీదత్ తీవ్రంగా నష్టపోయారు.
11) ఈ సినిమాతో వచ్చిన నష్టాలను జగపతిబాబు (Jagapathi Babu) ‘శుభలగ్నం’ సినిమా ద్వారా తీర్చుకున్నారు అశ్వనీదత్.
12) అయితే ‘గోవిందా గోవిందా’ సినిమా టీవీల్లో బాగానే చూశారు. రాజ్ (Thotakura Somaraju)- కోటి (Saluri Koteswara Rao) సంగీతంలో రూపొందిన పాటలు అన్నీ చార్ట్ బస్టర్స్ అయ్యాయి.