ఇద్దరు హీరోయిన్లు ఫ్రెండ్స్ అవ్వడం చాలా తక్కువ అని అంటుంటారు. అందులోనూ ఒకే తరానికి చెందిన ఇద్దరు హీరోయిన్లు ఇంకా కష్టం. ఈ మాటలు నిజం కావు అని నిరూపించిన కథానాయికలు సమంత, కీర్తి సురేశ్. సౌత్ సినిమాలో స్టార్ హీరోయిన్లుగా వెలుగొందుతున్న ఈ నాయికలు మూడు సినిమాల్లో కలసి నటించారు. అందులో ఓ సినిమాలోనే ఫుల్ లెంగ్త్ రోల్ చేశారు. కానీ ఇద్దరూ మంచి స్నేహితులు అయిపోయారు.
Keerthy Suresh, Samantha
సమంతపై తన ఇష్టాన్ని కీర్తి సురేశ్ ఇప్పటికే వివిధ సందర్భాల్లో వెల్లడించారు. తాజాగా మరోసారి సమంతపై ప్రశంసల వర్షం కురిపించింది. ఇటీవల ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంతకు కీర్తి సర్‌ప్రైజ్ వాయిస్ మెసేజ్ పంపింది. ‘‘సమంత.. నీతో ఉన్న అనుబంధాన్ని ఎలా వర్ణించాలి, ఎక్కడ నుండి ప్రారంభించాలో తెలియడం లేదు. మనం కలిసింది కొన్నిసార్లే అయినా.. ఎన్నో ఏళ్ల క్రితం నుండి కలిసి ఉన్నట్టు అనిపిస్తోంది’’ అని చెప్పుకొచ్చింది.
నువ్వు ఎప్పుడూ సూటిగా వ్యవహరిస్తావు. మహిళల కోసం ప్రతి సందర్భంలో ముందుంటావు. నాకు ఎన్నో విషయాల్లో స్ఫూర్తినిస్తుంటావు. అందుకే నిన్ను నా స్నేహితురాలు అనడం కంటే సిస్టర్ అని పిలవడం నాకిష్టం. జీవితంలో ఎదురైన ఎన్నో సవాళ్లను ధైర్యంగా ఫేస్ చేశావ్. ఇలాంటి పోరాటాలు చేయడం నీకు మాత్రమే సాధ్యం. జీవితం నీకు ఎన్ని సవాళ్లు విసిరినా రెట్టింపు బలంతో వాటిని ఎదుర్కొన్నావు. ఈ విషయంలో నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంటుంది అని చెప్పింది. దీనికి సమంత రియాక్ట్ అవుతూ థ్యాంక్యూ చెప్పింది. ఇద్దరూ కలసి ‘మహానటి’లో నటించారు. ఆ తర్వాత ‘సీమరాజా’, ‘మన్మథుడు 2’లో కనిపించారు.
‘తెరి’ సినిమాకు రీమేక్ ‘బేబీ జాన్’తో బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది కీర్తి సురేశ్. ఆ సినిమా అవకాశం రావడానికి కారణం సమంతనే అని కీర్తి చెప్పింది. ఈ సినిమా తమిళ వెర్షన్‌లో హీరోయిన్‌గా సమంతనే నటించిన విషయం తెలిసిందే. తొలుత హిందీ వెర్షన్‌లోనూ సమంతనే నటిస్తుందని వార్తలొచ్చాయి. కానీ ఆఖరికి కీర్తి సురేశ్‌ను ఎంచుకున్నారు.
‘పుష్ప 3’ గురించి దేవిశ్రీప్రసాద్ కామెంట్స్… అంటే ప్రాజెక్టు ఉన్నట్లేగా..!