
మంచు విష్ణు (Manchu Vishnu) హీరోగా ‘కన్నప్ప’ (Kannappa) సినిమా రూపొందుతుంది. హిందీలో ఒకటి, రెండు సీరియల్స్ తీసిన ముఖేష్ కుమార్ సింగ్ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఏప్రిల్ నెలలో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. దీనిపై మంచి అంచనాలే ఉన్నాయి. అందుకు కారణం ఏంటో మీకు తెలుసు. ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. అందుకే సినిమాపై హైప్ ఏర్పడింది. ట్రేడ్ సర్కిల్స్ లో కూడా ఈ సినిమాపై బజ్ ఏర్పడడానికి కారణం అదే.
Manchu Vishnu
ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు అక్షయ్ కుమార్ (Akshay Kumar), మోహన్ లాల్ (Mohanlal), శివరాజ్ కుమార్ (Shiva Rajkumar) వంటి స్టార్లు నటిస్తున్నారు. కానీ అందరి దృష్టి ప్రభాస్ పైనే ఉంది. ప్రమోషన్స్ లో కూడా విష్ణుకి ప్రభాస్ గురించే ఎక్కువ ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఇటీవల చెన్నైలో ‘కన్నప్ప’ ప్రమోషనల్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా .. మంచు విష్ణుకి ప్రభాస్ గురించి ఒక ప్రశ్న ఎదురైంది. దానికి విష్ణు సమాధానమిస్తూ.. ” ప్రభాస్ లేకపోతే ‘కన్నప్ప’ లేదు.
ఎందుకంటే ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని భావించి మా నాన్నగారు మోహన్ బాబుని ‘కన్నప్ప’ ప్రాజెక్టు చేయడానికి ఒప్పించారు. ఆయన వల్లే నాన్నగారు ‘కన్నప్ప’ చేయడానికి ముందుకొచ్చారు.” అంటూ చెప్పుకొచ్చాడు. ఇది నిజంగానే అతిశయోక్తిలా అనిపించకమానదు. వాస్తవానికి ప్రభాస్ ‘భక్తకన్నప్ప’ ప్రాజెక్టులో నటించాలని అతని పెదనాన్న కృష్ణంరాజు ఆశపడ్డారు.
ఈ విషయాన్ని ఆయన చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఇప్పుడు ప్రభాస్ కి ఉన్న ఇమేజ్ ను బట్టి.. ‘కన్నప్ప’ లాంటి ప్రాజెక్టులో లీడ్ రోల్ చేయలేడు. కనీసం ఈ రకంగా అయినా పెదనాన్న కోరిక తీర్చినట్టు ఉంటుంది అని ‘కన్నప్ప’ లో భాగం అయ్యాడు ప్రభాస్.