మెగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) , బాలకృష్ణ (Nandamuri Balakrishna) హోస్ట్ చేస్తున్న “అన్‌స్టాపబుల్ విత్ NBK” షోలో పాల్గొనడంతో ఫ్యాన్స్ లో మంచి అంచనాలు క్రియేట్ అవుతున్నాయి, దీనికి సంబంధించిన ఎపిసోడ్ ప్రోమో కూడా విడుదల అయ్యింది. ఎపిసోడ్‌లో చరణ్ తన వ్యక్తిగత జీవితం, సినిమా ప్రయాణం గురించి బాలయ్యతో అనేక ఆసక్తికర అంశాలు పంచుకున్నారని సమాచారం. ఈ సందర్భంగా చరణ్, పవన్ కళ్యాణ్ తనయుడు అఖిరా నందన్ సినీ రంగ ప్రవేశంపై కీలక వ్యాఖ్యలు చేసినట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.
Ram Charan
అఖిరా త్వరలో వెండితెరపై కనిపించనున్నాడని చరణ్ హింట్ ఇచ్చినట్లు సమాచారం. సుజీత్ (Sujeeth) దర్శకత్వంలో తెరకెక్కుతున్న “OG” (OG Movie) సినిమాలో అఖిరా స్పెషల్ కేమియోలో నటించే అవకాశం ఉందనే వార్తలు ఇదివరకే వినిపించాయి. ఇప్పుడు చరణ్ హింట్‌తో ఆ ఊహాగానాలు మరింత బలపడాయి. అనుకున్నట్లుగానే, ఈ షోలో బాలయ్య ప్రశ్నకు స్పందిస్తూ, “OG”లో అఖిరా కనిపిస్తాడా అనే సందేహానికి పర్ఫెక్ట్ గా స్పష్టతనూ ఇవ్వకపోయినా, ఏమో కనిపించవచ్చేమో అని ఒక కామెంట్ చేయడం ఆసక్తిని కలిగిస్తోంది.
అలాగే ఇటీవల, రేణు దేశాయ్ (Renu Desai) కూడా అఖిరా సినీ ఎంట్రీపై ఆసక్తి వ్యక్తం చేయడంతో విషయం మరింత హైలైట్ గా మారింది. అఖిరా ప్రస్తుతం నటన, మ్యూజిక్ పై అవగాహన తెచ్చుకునేలా శిక్షణ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. చరణ్, బాలయ్య మధ్య హాస్యభరిత సంభాషణలు మాత్రమే కాదు, అఖిరా గురించి చర్చ కూడా ఎపిసోడ్‌లో ప్రత్యేక హైలైట్‌గా నిలుస్తుందని తెలుస్తోంది.
OGలో అఖిరా నందన్ ప్రత్యేక పాత్రలో కనిపిస్తే, అది పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అభిమానులకు పండగే అవుతుంది. రామ్ చరణ్ ఇచ్చిన ఈ చిన్న హింట్, అఖిరా సినీ ప్రస్థానం త్వరలో ప్రారంభమయ్యే సూచనగా మారడం ఖాయం. ఇక జనవరి 8న ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది.