హీరోయిన్ సంజన గల్రాని పరిచయం అవసరం లేని పేరు. ప్రభాస్ బుజ్జిగాడు వంటి పలు సినిమాల్లో నటించిన ఈమె తెలుగులో పెద్దగా సక్సెస్ కాలేదు. కానీ కన్నడలో బాగానే సక్సెస్ అయ్యింది. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్న ఈమె.. ఒక మోస్తరు బిజీగా గడుపుతుంది. ఇదిలా ఉండగా.. ఇటీవల ఆమె పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో ఒక హీరో గురించి సంచలన విషయాలు చెప్పుకొచ్చింది. కానీ అతని పేరు మాత్రం రివీల్ చేయలేదు.
Sanjjanaa Galrani
సంజన గల్రాని మాట్లాడుతూ..”కన్నడలో ఒకడున్నాడు. టార్చర్ అయిపోయింది నాకు. అతను ఒక ఫ్రస్ట్రేటెడ్ గయ్. అతని పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు. ఒక సినిమా షూటింగ్లో భాగంగా అతనితో ఒక డాన్స్ మూమెంట్ చేయాలి. అది చేస్తున్న టైమ్లో వచ్చి నా చెయ్యి పిసికేశాడు. దీంతో నాకు చాలా నొప్పిగా అనిపించింది. చాలా కోపం కూడా వచ్చింది. దీంతో అతన్ని నిలదీసి అడిగాను. ‘నేను ఇందులో హీరోయిన్ గా నటించడానికి వచ్చాను. నీతో దెబ్బలు తినడానికి కాదు’ అని అన్నాను. దీంతో అతను సారి చెప్పి వెళ్లిపోయాడు.
తర్వాత తెలిసింది..నాకు మాత్రమే కాదు.. చాలా మంది నటీమణులకి నాలాంటి అనుభవం ఎదురైంది అని..! ” అంటూ చెప్పుకొచ్చింది. దీంతో సంజన ఏ హీరో గురించి చెప్పిందా అనే చర్చ సోషల్ మీడియాలో మొదలైంది. స్టార్ హీరో గురించి చెప్పిందా లేక ఎవరైనా స్టార్ కిడ్ గురించి చెప్పిందా అంటూ డిస్కస్ చేసుకుంటున్నారు.