విక్టరీ వెంకటేష్ (Venkatesh Daggubati), దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబినేషన్లో ‘ఎఫ్ 2’ (F2 Movie) ‘ఎఫ్ 3’ (F3 Movie) వంటి హిట్ల తర్వాత వచ్చిన సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam). దిల్ రాజు (Dil Raju) నిర్మాణంలో రూపొందిన ఈ సినిమాకి భీమ్స్ (Bheems Ceciroleo) సంగీతం అందించాడు. ‘గోదారి గట్టు మీద’ అనే పాట చార్ట్ బస్టర్ అయ్యి సినిమాపై అంచనాలు పెంచింది.జనవరి 14న రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి రోజు పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది.
Sankranthiki Vasthunam Collections:
3 రోజులకే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది. ఒకసారి 3 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 12.95 cr |
సీడెడ్ | 6.77 cr |
ఉత్తరాంధ్ర | 5.32 cr |
ఈస్ట్ | 4.49 cr |
వెస్ట్ | 3.37 cr |
కృష్ణా | 3.60 cr |
గుంటూరు | 4.20 cr |
నెల్లూరు | 1.66 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 42.36 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 3.30 cr |
ఓవర్సీస్ | 6.11 cr |
టోటల్ వరల్డ్ వైడ్ | 51.77 cr (షేర్) |
‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam ) సినిమాకు రూ.40 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.41 కోట్ల షేర్ ను రాబట్టాలి. 3 రోజుల్లోనే ఈ సినిమా రూ.51.77 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా రూ.10.77 కోట్ల లాభాలు అందించి బ్లాక్ బస్టర్ లిస్టులోకి ఎంట్రీ ఇచ్చేసింది. రాబోయే రోజుల్లో ఈ సినిమా మరింతగా కలెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి.