విక్టరీ వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘ఎఫ్ 2’ ‘ఎఫ్ 3’ వంటి హిట్ల తర్వాత రూపొందిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. దిల్ రాజు నిర్మాణంలో రూపొందిన ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి… హీరోయిన్లుగా నటించారు. భీమ్స్ సంగీతం అందించిన ఈ సినిమాలోని ‘గోదారి గట్టు మీద’ అనే పాట చార్ట్ బస్టర్ అయ్యి వంద మిలియన్లకు పైగా వ్యూస్ ని కొల్లగొట్టింది.ఎన్నో ఏళ్ల తర్వాత రమణ గోగుల ఈ పాట పాడటం జరిగింది. దీంతో జనవరి 14న రిలీజ్ అయిన ఈ సినిమా… మొదటి రోజు సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని భారీ వసూళ్లు సాధిస్తుంది.
Sankranthiki Vasthunam Collections
ఒకసారి 2 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 8.75 cr |
సీడెడ్ | 4.97 cr |
ఉత్తరాంధ్ర | 3.42 cr |
ఈస్ట్ | 3.06 cr |
వెస్ట్ | 2.52 cr |
కృష్ణా | 2.40 cr |
గుంటూరు | 2.95 cr |
నెల్లూరు | 1.17 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 29.24 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 2.8 cr |
ఓవర్సీస్ | 5.5 cr |
టోటల్ వరల్డ్ వైడ్ | 37.54 cr (షేర్) |
‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాకు రూ.40 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.41 కోట్ల షేర్ ను రాబట్టాలి. 2 రోజుల్లోనే ఈ సినిమా రూ.37.54 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి మరో రూ.3.46 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఈరోజుతో ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
Daaku Maharaaj Collections: ‘డాకు మహారాజ్’… మాస్ సెంటర్స్ లో కుమ్మేస్తున్న బాలయ్య!