ఇండస్ట్రీలోకి వచ్చి ఏళ్ళు గడిచినా సరైన సక్సెస్ లేక సతమతమవుతున్న వారిలో శ్రద్ధా శ్రీనాథ్ ఒకరు. జెర్సీ, విక్రమ్ వేదా లాంటి కంటెంట్ ఉన్న సినిమాలతో మంచి గుర్తింపు అందుకున్న అమ్మడు కమర్షియల్ గా మాత్రం బిగ్ స్టార్స్ లీగ్ లో నిలవలేకపోతోంది. ఇక ఫైనల్ గా ఇన్నాళ్ళకు బాలయ్య తో ఒక కమర్షియల్ సక్సెస్ చూసే అదృష్టం లభిస్తోంది. ‘డాకు మహారాజ్’ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్ పాత్రకు మంచి స్పందన వచ్చింది.
Shraddha Srinath
ఈ సినిమాలో ఆమె ఎమోషనల్ క్యారెక్టర్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఈ సక్సెస్ తర్వాత, శ్రద్ధా కి మరో బిగ్ ప్రాజెక్ట్ దక్కినట్టు చర్చ జరుగుతోంది. ఏకంగా సూపర్ స్టార్ రజినీకాంత్ తో ఛాన్స్ అందుకున్నట్లు టాక్. నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జైలర్’ భారీ విజయం సాధించడంతో, దాని కొనసాగింపుగా ‘జైలర్ 2’ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సీక్వెల్‌లో శ్రద్ధా శ్రీనాథ్ కీలక పాత్రలో కనిపించనుందని టాక్.
‘జైలర్ 2’లో శ్రద్ధా పాత్రకు బలమైన ఎమోషన్ తో పాటు డీప్ క్యారెక్టర్ డెవలప్మెంట్ ఉందట. ఆమెకు ఈ ప్రాజెక్ట్ చాన్స్ రావడం ఆమె కెరీర్ లో మరో బిగ్ బ్రేక్ అని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ సినిమాలో ఆమె పాత్ర రజినీకాంత్ పాత్రతో ముడిపడి ఉంటుందని, కథను ముందుకు నడిపే కీలక ఘట్టంగా మారనుందని సమాచారం. ఇక సీక్వెల్‌లో తమన్నా, రమ్యకృష్ణ, యోగిబాబు వంటి నటీనటులు తమ పాత్రలను కొనసాగించనున్నారు.
‘జైలర్ 2’ కోసం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జోరుగా జరుగుతోంది. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా నిర్మిస్తున్నారు. కాగా, సీక్వెల్‌లో కూడా అనిరుద్ సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ‘జైలర్’ చిత్రం గానూ దక్షిణ భారతదేశం మొత్తం భారీ క్రేజ్ తెచ్చుకున్న రజినీకాంత్, సీక్వెల్‌లో తన పాత్రను మరింత పవర్‌ఫుల్‌గా ప్రజెంట్ చేయనున్నారని తెలుస్తోంది. నెల్సన్ ఈసారి మరింత పవర్ఫుల్ కథనం, పాన్ ఇండియా రేంజ్‌లో ప్రెజెంటేషన్‌పై ఫోకస్ పెట్టినట్లు సమాచారం.