శ్రీలీల (Sreeleela) .. టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది. ‘మాస్ జాతర’ (Mass Jathara) వంటి పెద్ద సినిమాల్లో నటిస్తూనే.. పక్క భాషల్లో కూడా సినిమాలు చేయాలని డిసైడ్ అయ్యింది. తమిళంలో ఆల్రెడీ ఓ పెద్ద ఆఫర్ పట్టేసింది. ఇప్పుడు బాలీవుడ్ పై కూడా ఫోకస్ పెట్టినట్టు స్పష్టమవుతుంది. ఇదిలా ఉండగా.. శ్రీలీల బాయ్ ఫ్రెండ్ అంటూ ఓ వ్యక్తి ఫోటోలు, వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. శ్రీలీలకి సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.
Sreeleela
ఇందులో ఆమె ఓ వ్యక్తితో చాలా సన్నిహితంగా ఉన్నట్లు కనిపిస్తుంది. దీంతో ఈ వీడియోలో ఉన్నది ‘శ్రీలీల బాయ్ ఫ్రెండ్’ అంటూ కొందరు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. కానీ అందులో నిజం లేదు. ఈ వీడియోలో ఉన్నది సైఫ్ అలీ ఖాన్ నట వారసుడు ఇబ్రహీం అలీ ఖాన్. అతన్ని కరెక్ట్ గా గమనిస్తే.. చేతిలో పేపర్లు కనిపిస్తున్నాయి. కొద్దిరోజులుగా శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోంది అంటూ సోషల్ మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి.
లేటెస్ట్ వీడియోని బట్టి అవి నిజమేనేమో అని అర్థం చేసుకోవచ్చు. ఇబ్రహీం అలీ ఖాన్ డెబ్యూ మూవీలో శ్రీలీల హీరోయిన్ గా నటించబోతుందని స్పష్టమవుతుంది. ఇది ఆమెకు బాలీవుడ్ డెబ్యూ మూవీ అవుతుంది. ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule) లో శ్రీలీల చేసిన ‘కిస్సిక్’ అనే ఐటెం సాంగ్ కి భీభత్సమైన రీచ్ వచ్చింది. సినిమా రిలీజ్ తర్వాత నార్త్ లో ‘కిస్సిక్ గర్ల్’ గా శ్రీలీల అక్కడ ఫేమస్ అయిపోయింది. దీంతో ఆమెకు బాలీవుడ్ నుండి వరుస ఆఫర్లు వస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు.
View this post on Instagram