నాగ చైతన్య (Naga Chaitanya) , సాయి పల్లవి (Sai Pallavi) హీరో,హీరోయిన్లుగా చందూ మొండేటి (Chandoo Mondeti) దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘తండేల్’ (Thandel) . శ్రీకాకుళం మత్స్యకారుల జీవితాల నేపథ్యంలో రూపొందుతున్న ఈ ప్రేమకథా చిత్రం కోసం ప్రేక్షకులు.. ముఖ్యంగా నాగ చైతన్య అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొదట 2024 డిసెంబర్, ఆ తర్వాత 2025 సంక్రాంతికి విడుదల అవుతుంది అని ప్రచారం జరిగినప్పటికీ, కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ఫిబ్రవరి 7న ‘తండేల్’ ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు.
Thandel
అయితే అనుకున్న డేట్ కి ‘తండేల్’ వస్తుందా? అనే డౌట్లు కూడా చాలా మందిలో ఉన్నాయి. ఎందుకంటే సముద్రం బ్యాక్ డ్రాప్లో తీయాల్సిన సన్నివేశాలు, పాకిస్తాన్ సీక్వెన్స్, భారీ జాతర పాట వంటి ప్రత్యేక అంశాలకు సంబంధించి సిజీ వర్క్స్ ఎక్కువ ఉండటంతో, చిత్ర నిర్మాణంలో జాప్యం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సన్నివేశాల్లో బెస్ట్ క్వాలిటీతో అందించాలనే ఉద్దేశంతో చిత్ర యూనిట్ చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది.
గీతా ఆర్ట్స్ పతాకంపై బన్నీ వాసు (Bunny Vasu) నిర్మిస్తున్న ఈ చిత్రం, గీతా సంస్థలో ఇటీవలి కాలంలో అత్యంత భారీ బడ్జెట్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. నాగ చైతన్య కెరీర్‌లోనే ఇది అత్యంత భారీ బడ్జెట్ చిత్రం కావడం విశేషం. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని నిర్మాత బన్నీ వాసు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
అందుకే ఎక్కడా రాజీ పడకుండా, అద్భుతమైన అవుట్ పుట్ కోసం కృషి చేస్తున్నారు. ప్రస్తుతం చిత్ర యూనిట్ రాత్రింబవళ్ళు పనిచేస్తోంది. ఫిబ్రవరి 7న సినిమాను విడుదల చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. మరి ‘తండేల్’ అనుకున్న డేట్ కి వస్తుందా? లేక పోస్ట్ పోన్ అవుతుందా అనేది..? ఈ నెలాఖరుకి ఓ క్లారిటీ వచ్చేస్తుంది.