సంక్రాంతికి బాలకృష్ణ (Nandamuri Balakrishna) నటించిన ‘డాకు మహారాజ్’ (Daaku Maharaaj) రిలీజ్ కాబోతుంది. బాబీ కొల్లి (Bobby) దర్శకత్వం వహించిన సినిమా ఇది. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ (Suryadevara Naga Vamsi) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ (S.S.Thaman) సంగీతం అందించిన ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే రెండు పాటలు రిలీజ్ అయ్యాయి. అవి ప్రేక్షకులను పెద్దగా ఇంప్రెస్ చేయలేదు. బహుశా.. సినిమా రిలీజ్ అయ్యాక అవి.. ఎక్కొచ్చేమో. కానీ ఇప్పుడు హైప్ పెంచడానికి అవి పని చేయలేదు.
Urvashi Rautela
దీన్ని గ్రహించిన చిత్ర బృందం ‘దబిడి దిబిడి’ అనే మాస్ లిరికల్ సాంగ్ ని(3వ పాటని) నిన్న యూట్యూబ్లో విడుదల చేసింది. ‘ఉలాల్లా ఉలాల్లా.. నా మువ్వ గోపాల.. కత్తుల తోటే కంటిచూపుతోనే చంపాలా’ అంటూ బాలకృష్ణ (Nandamuri Balakrishna) బ్రాండ్ డైలాగ్స్ తో కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించాడు. ఊర్వశి (Urvashi Rautela) గ్లామర్ ఈ సాంగ్ కి మెయిన్ హైలెట్ అయ్యింది.సింగర్ వాగ్దేవి చాలా హుషారెత్తించే విధంగా పాడింది. మధ్య మధ్యలో తమన్ వోకల్స్ కూడా బాగా సెట్ అయ్యాయి.
కాకపోతే.. మధ్య మధ్యలో బాలయ్య- ఊర్వశి..ల మధ్య వచ్చే డాన్స్ మూమెంట్స్ మాత్రం తేడా కొట్టాయి.శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీని కూడా అంతా విమర్శిస్తూ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తంగా ఈ సాంగ్ వినడానికంటే కూడా బాలయ్య- ఊర్వశి..ల డాన్స్ మూమెంట్స్ వల్ల వైరల్ అవుతుంది. చాలా మంది నెటిజన్లు దీనిపై నెగిటివ్ కామెంట్స్ తో మీమ్స్ చేస్తున్నారు.
అయితే నెటిజన్లు నెగిటివ్ కామెంట్స్, బూతులతో చేస్తున్న మీమ్స్ ను ఊర్వశి (Urvashi Rautela) తన ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్ గా పెట్టుకోవడం గమనార్హం. బహుశా వాళ్ళు రాసిన బూతులు ఆమెకు అర్థం కాలేదేమో అని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరి విషయం తెలిశాక… దీనిపై ఆమె ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.