నటుడు టి.కె.వినాయకన్ అందరికీ సుపరిచితమే. మలయాళ నటుడు అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులకు కూడా ఇతను సుపరిచితమే. 2006 లో వచ్చిన కళ్యాణ్ రామ్… ‘అసాధ్యుడు’ సినిమాలో ఇతను విలన్ గా నటించాడు. ఆ సినిమా పెద్దగా ఆడలేదు. కానీ 2023 ఆగస్టులో వచ్చిన రజినీకాంత్ ‘జైలర్’ సినిమాలో విలన్ గా నటించి పాన్ ఇండియా వైడ్ పాపులర్ అయిపోయాడు. తాజాగా ఇతనికి సంబంధించిన ఓ అసభ్యకరమైన వీడియో బయటకు వచ్చింది.
Vinayakan
వివరాల్లోకి వెళితే.. మలయాళ నటుడు వినాయకన్ ఫుల్లుగా మద్యం సేవించి పక్కింటి వాళ్ళతో గొడవ పడుతున్న వీడియో ఒకటి బయటపడింది. అతని ఇంటి బాల్కనీ నుండి పక్కింటి వాళ్లపై పరుస్తూ వీరంగం సృష్టించాడు వినాయకన్. అతని వంటిపై టవల్ మాత్రమే ఉంది.ఫుల్లుగా ఆన్లో ఉండటం వల్ల మాట కూడా సరిగ్గా రావడం లేదు. సరిగ్గా నిలబడ లేక అటు.. ఇటు తూలుతూ ఫైనల్ గా కింద పడిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది.
ఇలాంటి నటులను వెంటనే బహిష్కరించాలని సోషల్ మీడియాలో నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. వినాయకన్ తీరు మొదటి నుండి ఇలానే ఉంటుంది. ఏడాది క్రితం ఇతన్ని పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. 2023 అక్టోబర్ టైంలో కూడా వినాయకన్ ఫుల్లుగా తాగేసి పబ్లిక్ ప్లేస్లో న్యూసెన్స్ చేస్తున్నాడని ‘పబ్లిక్ వయోలేషన్’ సెక్షన్ కింద ఇతన్ని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత ఎలాగోలా బయటికి వచ్చేశాడు. ఇప్పుడు మళ్ళీ తాగేసి రచ్చ చేశాడు వినాయకన్. మరి ఈసారి ఏమవుతుందో చూడాలి :