యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ లో తన ప్రతిభను మరోసారి ప్రదర్శించేందుకు సిద్ధమయ్యారు. వార్ 2లో ఆయన నటిస్తుండటంతో తెలుగు, హిందీ ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా, ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.
War2 Movie
హృతిక్, ఎన్టీఆర్ కలిసి స్క్రీన్ పై కనిపించాలంటే తప్పకుండా దానికి తగిన యాక్షన్, ఎమోషనల్ సన్నివేశాలు ఉండాలని అందరూ భావిస్తున్నారు. ఇదే విషయంలో హృతిక్ ఇటీవల మాట్లాడుతూ, ఎన్టీఆర్‌తో డాన్స్ చేయడం సవాలుగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఆయనతో పాటుగా ఒక స్టెప్ కూడా అనుసరించాలంటే మరింతగా ప్రిపరేషన్ అవసరం అని పేర్కొన్నారు. హృతిక్ ఎన్టీఆర్ కలిసి చేసే ఫ్యాన్స్ RRR నాటు నాటు పాట కంటే హై లెవెల్లో ఉంటుందట. ఇక హృతిక్ మాటలతో సినిమా పై ఆసక్తి మరింత పెరిగింది.
ఇందులో ఎన్టీఆర్ పాత్ర పూర్తి నెగటివ్ షేడ్స్‌తో ఉంటుందని టాక్. అటు డాన్స్, ఇటు యాక్షన్‌లో హృతిక్‌తో పోటీ పడాల్సిన ఈ పాత్రకు ఎన్టీఆర్ పూర్తి న్యాయం చేస్తారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. యాక్షన్ సన్నివేశాల్లో హృతిక్ తన మార్క్ చూపిస్తే, డాన్స్‌లో ఎన్టీఆర్ తన ప్రత్యేకతను మరోసారి చాటుకుంటారని అభిమానులు నమ్మకంగా ఉన్నారు.
వార్ 2 విడుదలకు సంబంధించి ఇప్పటికే మేకర్స్ కొన్ని తేదీలను పరిశీలించినప్పటికీ, వాస్తవానికి షూటింగ్ ఇప్పటివరకు పూర్తయి ఉండకపోవడంతో విడుదల వాయిదా పడే అవకాశం ఉందని సమాచారం. అయితే, ఈ చిత్రం విడుదలయ్యాక బాలీవుడ్, టాలీవుడ్ బౌండరీలు మరింత విస్తరించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇక వార్ 2 తర్వాత ఎన్టీఆర్ తన తదుపరి ప్రాజెక్ట్‌లపై దృష్టి పెట్టనున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మల్టీ జానర్ సినిమా చేయబోతుండగా, మరోవైపు దేవర 2 కూడా లైన్‌లో ఉంది.