![List of Movies Acted by Heroes After Marriage and Their Results](https://blr1.digitaloceanspaces.com/assets.telugu/wp-content/uploads/2025/02/List-of-Movies-Acted-by-Heroes-After-Marriage-and-Their-Results.jpg)
సినిమా వాళ్ళు తొందరగా పెళ్లిళ్లు చేసుకోరు. హీరోలైతే పెళ్లి తర్వాత ఫ్యామిలీ వల్ల సినిమాలకు ఎక్కువ టైమ్ ఇవ్వలేము తొందరగా పెళ్లి చేసుకోరు. ఇక హీరోయిన్లు అయితే తొందరగా పెళ్లి చేసుకుంటే వాళ్ల డిమాండ్ తగ్గిపోతుంది, ఆఫర్లు రావు అనే భయంతో చేసుకోరు. సరే ఈ సంగతి పక్కన పెడితే.. ఇప్పుడు హీరోల గురించి మాట్లాడుకుందాము. వాళ్ళ పెళ్ళి , పర్సనల్ లైఫ్ వంటి వ్యవహారాలు ఎక్కువగా హైలెట్ అవుతూ ఉంటాయి. వాళ్ళ ఫ్యామిలీ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తూ ఉంటాయి.
అయితే పెళ్లి తర్వాత హీరోల నుండీ వచ్చిన మొదటి సినిమా ఏంటి? వాటి ఫలితాలు ఏంటి? అనేది తెలుసుకోవాలని చాలా మందికి ఆశగా ఉంటుంది. ఇప్పుడు మనం ఆ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాము :
Movies Acted by Heroes After Marriage and Their Results
1) పవన్ కళ్యాణ్ :
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తన మొదటి భార్య నందినికి విడాకులు ఇచ్చిన తర్వాత రేణు దేశాయ్ ని (Renu Desai) 2009 లో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఏడాదికి ‘కొమరం పులి’ (Komaram Puli) సినిమా రిలీజ్ అయ్యింది. ఇది పెద్ద డిజాస్టర్ అయ్యింది. అటు తర్వాత ఆమెతో కూడా విడాకులు తీసుకున్నాక 2013 లో అంజనా లెజినోవాను వివాహం చేసుకున్నారు. అటు తర్వాత రిలీజ్ అయిన ‘గోపాల గోపాల’ (Gopala Gopala) పర్వాలేదు అనేలా ఆడింది.
2) మహేష్ బాబు :
అప్పటివరకు ప్రిన్స్ గా పిలవబడుతూ వచ్చిన మహేష్ బాబు (Mahesh Babu) 2005లో నమ్రత శిరోద్కర్(Namrata Shirodkar) ను వివాహం చేసుకున్నారు. అటు తర్వాత మొదటిగా రిలీజ్ అయిన సినిమా ‘అతడు’ (Athadu). ఇది డీసెంట్ హిట్ అయ్యింది. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు రేంజ్ పెరిగింది.
3) రాంచరణ్ :
మెగా పవర్ స్టార్ రాంచరణ్ (Ram Charan) 2012 జూన్ లో ఉపాసన కామినేనిని వివాహం చేసుకున్నారు. అటు తర్వాత ముందుగా రిలీజ్ అయిన సినిమా ‘నాయక్’ (Naayak). ఇది సూపర్ హిట్ అయ్యింది.
4) జూ ఎన్టీఆర్ :
యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) 2012 లో లక్ష్మీ ప్రణతిని వివాహం చేసుకున్నాడు. అటు తర్వాత ముందుగా ‘ఊసరవెల్లి’ (Oosaravelli) రిలీజ్ అయ్యింది. ఇది జస్ట్ యావరేజ్ ఫలితాన్ని అందుకుంది.
5) అల్లు అర్జున్ :
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun).. స్నేహ రెడ్డిని 2011 లో వివాహం చేసుకున్నారు. అటు తర్వాత ముందుగా వచ్చిన ‘బద్రీనాథ్’ (Badrinath) సినిమా ప్లాప్ అయ్యింది.
6) నాని :
నేచురల్ స్టార్ నాని (Nani) 2012 లో అంజనా యాలవర్తిని వివాహం చేసుకున్నారు. అటు తర్వాత ‘పైసా’ (Paisa) సినిమా రిలీజ్ అయ్యింది. ఇది ప్లాప్ గా మిగిలిపోయింది.
7) వరుణ్ తేజ్ :
వరుణ్ తేజ్ (Varun Tej) 2023 నవంబర్ లో హీరోయిన్ లావణ్య త్రిపాఠిని వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ముందుగా వరుణ్ తేజ్ నుండి వచ్చిన సినిమా ‘ఆపరేషన్ వాలెంటైన్’ (Operation Valentine). ఈ సినిమా పెద్ద డిజాస్టర్ అయ్యింది.
8) నితిన్ :
నితిన్ (Nithin) 2020 కరోనా టైంలో పెళ్లి చేసుకున్నారు. షాలిని కందుకూరిని అతను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అటు తర్వాత ముందుగా అతని నుండి వచ్చిన సినిమా ‘చెక్’ (Check). ఇది పెద్ద ప్లాప్ అయ్యింది.
9) నిఖిల్ :
నిఖిల్ (Nikhil Siddhartha) వివాహం కూడా 2020 లో కరోనా టైంలో జరిగింది. పల్లవి వర్మ అనే డాక్టర్ ను అతను పెళ్లి చేసుకున్నాడు. అటు తర్వాత అతని నుండి వచ్చిన సినిమా ‘కార్తికేయ 2’ (Karthikeya 2) ఇది అతని కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.
10) నాగ చైతన్య :
అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya) 2017 లో సమంతని వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత అతని నుండి ‘శైలజారెడ్డి అల్లుడు’ (Shailaja Reddy Alludu) అనే సినిమా వచ్చింది. అది యావరేజ్ గా ఆడింది. అటు తర్వాత 2021 లో ఈ జంట విడిపోయిన సంగతి తెలిసిందే. కొన్నాళ్ళకి అంటే 2024 డిసెంబర్ లో శోభిత ధూళిపాళ (Sobhita Dhulipala) ని వివాహం చేసుకున్నాడు నాగ చైతన్య. ఈసారి ముందుగా ‘తండేల్’ (Thandel) వచ్చింది. దీనికి పాజిటివ్ టాక్ వస్తుండటం విశేషంగా చెప్పుకోవాలి.