
సినీ పరిశ్రమలో మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. 2025 లో చూసుకుంటే…దర్శకురాలు అపర్ణ మల్లాది, సీనియర్ నటుడు విజయ రంగరాజు అలియాస్ రాజ్ కుమార్, నటుడు యోగేష్ మహాజన్, నిర్మాత మనో అక్కినేని,నటుడు జయశీలన్, మలయాళ దర్శకుడు షఫీ,స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ తల్లి లివి సురేష్ బాబు, అలాగే రానా అమ్మమ్మ రాజేశ్వరి, నిర్మాత వేద రాజు టింబర్,నిర్మాత కేపీ చౌదరి, సీనియర్ నటి పుష్పలత వంటి వారు కన్నుమూశారు.
Ajith Vijayan:
ఇప్పుడు మరో బ్యాడ్ న్యూస్ వినాల్సి వస్తుంది. మలయాళ సినీ పరిశ్రమలో ఈ విషాదం చోటు చేసుకున్నట్టు స్పష్టమవుతుంది. వివరాల్లోకి వెళితే… ప్రముఖ మలయాళ నటుడు అజిత్ విజయన్ (Ajith Vijayan) ఈరోజు మృతి చెందారు. ఆదివారం నాడు ఆయన మరణించినట్లు తెలుస్తుంది.కాకపోతే ఈ వార్త కొంచెం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అజిత్ విజయన్ (Ajith Vijayan) వయసు 57 ఏళ్ళు. ఆయన మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.కొచ్చిలో ఉన్న తన నివాసంలోనే ఆయన మరణించినట్లు సమాచారం.
అజిత్ విజయన్.. భార్య ధన్య అలాగే ఇద్దరు కుమార్తెలు గౌరీ, గాయత్రి..లతో జీవిస్తూ వచ్చారు. ఇలా జరగడంతో వాళ్ళు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. ‘ఒరు ఇండియన్’ ‘ప్రణయ కథ’ ‘బెంగళూరు డేస్’ ‘అమర్ అక్బర్ ఆంథోనీ’ ‘అంజు సుందరికల్’ వంటి చిత్రాల్లో ఆయన నటించారు. అజిత్ విజయన్ (Ajith Vijayan) మరణవార్తతో మలయాళ చిత్రసీమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పలువురు సినీ ప్రముఖులు ఆయన మరణానికి చింతిస్తూ.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.