
తెలుగు బిగ్ బాస్ ఇప్పుడు 9వ సీజన్ కి (Bigg Boss 9) రెడీ అవుతోంది. గత ఎనిమిది సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో, ఇప్పుడు మరింత కొత్తతనాన్ని చూపించేందుకు ప్లాన్ చేస్తోంది. అయితే గత సీజన్లలో చోటుచేసుకున్న కొన్ని తప్పిదాలు, ప్రేక్షకుల ఆసక్తి తగ్గడమే కాకుండా, రేటింగ్ పరంగా కాస్త వెనుకబడి పోవడం వల్ల, ఈసారి కచ్చితమైన మార్పులతో బిగ్ బాస్ టీమ్ ముందుకెళ్తున్నట్లు సమాచారం. సాధారణంగా బిగ్ బాస్ ప్రతి ఏడాది ఆగస్ట్ లేదా సెప్టెంబర్‌లో ప్రారంభమవుతుంది.
Bigg Boss 9
కానీ, ఈసారి షోను మరింత ముందుకు తెచ్చే అవకాశం ఉందని టాక్. ముఖ్యంగా, కంటెస్టెంట్స్ ఎంపికలో ఈసారి భారీ మార్పులు ఉంటాయని సమాచారం. గత సీజన్లలో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా పాత కంటెస్టెంట్స్‌ను తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు అలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదనే నిర్ణయానికి బిగ్ బాస్ టీమ్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇకపోతే, గత రెండు సీజన్లలో రొమాన్స్, లవ్ ట్రాక్‌లు సరిగ్గా వర్కౌట్ కాలేదు. అందువల్ల షోపై ఆసక్తి తగ్గిపోయిందని, రేటింగ్స్ పడిపోయాయని భావిస్తున్నారు.
ఈసారి బిగ్ బాస్ 9 లో (Bigg Boss 9) అలాంటి అంశాలు సహజంగా జరిగేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దానికి తగ్గట్టుగానే కంటెస్టెంట్స్ సెలెక్షన్ జరుపుతున్నారని సమాచారం. హౌస్‌లో ఎమోషనల్ కనెక్షన్స్ పెంచేలా కంటెస్టెంట్ల ఎంపిక ఉంటుందని బిగ్ బాస్ టీమ్ చెబుతోంది. హోస్ట్ విషయానికి వస్తే, నాగార్జున (Nagarjuna) ఈసారి కూడా కొనసాగనున్నట్లు సమాచారం. ఆయన గత కొన్ని సీజన్లుగా షోను హ్యాండిల్ చేస్తూ వచ్చారు. అయితే, గత సీజన్లలో కొన్ని విమర్శలు ఎదురవ్వడం, బిగ్ బాస్ టీమ్ కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల సమస్యలు వచ్చాయి.
అవి మళ్లీ రిపీట్ కాకుండా ఈసారి కచ్చితమైన ప్లానింగ్‌తో బిగ్ బాస్ టీమ్ ముందుకెళ్తోంది. కామన్ మ్యాన్ ఎంట్రీ విషయంలోనూ మార్పులు చేశారు. గతంలో కామన్ మ్యాన్ హౌస్‌లోకి వెళ్లినప్పుడు వారికి సింపతీ ఎక్కువగా వచ్చి, సెలబ్రిటీ కంటెస్టెంట్స్‌కు ఇబ్బంది కలిగిందని బిగ్ బాస్ టీమ్ భావిస్తోంది. అందుకే, ఈసారి బిగ్ బాస్ 9లో కామన్ మ్యాన్ ఎంట్రీ ఉండదనే టాక్ బలంగా వినిపిస్తోంది. మొత్తం మీద, బిగ్ బాస్ 9 (Bigg Boss 9) ఈ సారి మరో లెవెల్‌లో ప్లాన్ అవుతున్నట్లు కనిపిస్తోంది. మరి ఈ సీజన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి!