
సినీ పరిశ్రమలో మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. 2025 లో అప్పుడే .. దర్శకురాలు అపర్ణ మల్లాది, సీనియర్ నటుడు విజయ రంగరాజు అలియాస్ రాజ్ కుమార్, నటుడు యోగేష్ మహాజన్, నిర్మాత మనో అక్కినేని,నటుడు జయశీలన్,మలయాళ దర్శకుడు షఫీ,స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ తల్లి లివి సురేష్ బాబు, అలాగే రానా అమ్మమ్మ రాజేశ్వరి, నిర్మాత వేద రాజు టింబర్,నిర్మాత కేపీ చౌదరి, సీనియర్ నటి పుష్పలత, మలయాళ నటుడు అజిత్ విజయన్, దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి తండ్రి వంటి వారు కన్నుమూశారు.
ఈ షాక్.. ల నుండి ఇండస్ట్రీ కోలుకోకుండానే ఇప్పుడు మరో షాకింగ్ న్యూస్ వినాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. హాలీవుడ్ పాప్ సింగర్ అయినటువంటి రాబెర్టా ఫ్లాక్ నిన్న రాత్రి కన్నుమూసినట్టు తెలుస్తుంది. ఆమె వయసు ప్రస్తుతం 88 ఏళ్ళు. ఆమె మరణవార్తని కుటుంబ సభ్యులు వెల్లడించారు. కానీ ‘ఆమె మరణానికి గల కారణాలు ఏంటి’ అనేది వారు రివీల్ చేయలేదు.
చాలా కాలం నుండి ఆమె వయోభారం అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు రాబెర్టా ఫ్లాక్ స్నేహితులు మీడియాతో చెప్పుకొచ్చినట్టు సమాచారం. 1970 ..ల టైంలో ‘కిల్లింగ్ మీ సాఫ్ట్ లీ’, ‘ది ఫస్ట్ టైం ఎవరు ఐ సా యువర్ ఫేస్’ వంటి పాటలతో ఈమె పేరు మార్మోగింది. ఆ పాటలకి గాను గ్రామీ అవార్డులు కూడా లభించాయి. ఇక రాబెర్టా ఫ్లాక్ మృతి పట్ల పలువురు హాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.