చిన్న సినిమాగా మొదలై, చిన్న సినిమాగానే విడుదలై.. పెద్ద సినిమాగా మారి, ఫైనల్‌గా బ్లాక్‌బస్టర్ అయిన సినిమాలు చాలా తక్కువ ఉంటాయి. అలాంటి వాటిలో ‘కాంతార’ ఒకటి. రిషబ్ శెట్టి (Rishab Shetty) స్వీయ దర్శకత్వంలో నటించిన సినిమా ఇది. కన్నడ సినిమాలో తెరకెక్కిన ఈ సినిమాను దేశం మొత్తం ఆదరించింది. ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ కాదు కానీ ప్రీక్వెల్ రెడీ చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం తెలిసింది. ఈ సినిమా యాక్షన్ సీక్వెన్స్ టీమ్ భారీ ప్లాన్ చేస్తోందట.
Kantara
‘కాంతార: చాప్టర్ 1’ (Kantara) సినిమా కదంబ కాల నేపథ్యంలో సాగే కథతో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి సినిమాల్లో యుద్ధ సన్నివేశాలకు ప్రాధాన్యత ఉంటుంది. దాని కోసం రిషబ్ శెట్టి 500 మందితో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ రెడీ చేస్తున్నారట. దీని కోసం యుద్ధ విద్యలో నైపుణ్యం ఉన్న 500మందికి పైగా ఫైటర్లను టీమ్ రప్పించిందట. ప్రస్తుతం వారితో రిహార్సల్స్ జరుగుతున్నాయని తెలుస్తోంది.
సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్న ఈ భారీ యుద్ధ ఘట్టాన్ని కుందాపూర్ పరిసర ప్రాంతాల్లో త్వరలో చిత్రీకరిస్తారు అని చెబుతున్నారు. మరోవైపు ఈ సన్నివేశాల కోసం రిషబ్ కొన్ని నెలలుగా కలరిపయట్టు యుద్ధ విద్య, గుర్రపుస్వారీ, కత్తిసాము తదితర విద్యల్లో శిక్షణ తీసుకుంటున్నాడట. త్వరలో వార్ సీక్వెన్స్ తెరకెక్కించేందుకు టీమ్ ప్లాన్ చేస్తోందట. ఇక చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా అక్టోబరు 2న ప్రేక్షకుల రిలీజ్ చేస్తారట.
‘కాంతార’ సినిమా ముగిసిన దగ్గర నుండి కాకుండా సినిమా ప్రారంభానికి ముందు ఏం జరిగింది అనే విషయాల్ని అప్పటి సంప్రదాయాలను మేళవిస్తూ ఈ సినిమాను తెరకెక్కించే పనిలో ఉన్నారు రిషబ్ శెట్టి. మొదటి సినిమాను కన్నడలో రిలీజ్ చేసి హిట్టయ్యాక దేశం మొత్తం విడుదల చేశారు. కానీ ఈ సినిమాను ప్రారంభం నుండి పాన్ ఇండియా చిత్రంగానే తెరకెక్కిస్తున్నారు. కాబట్టి ఈ సారి పారలల్ రిలీజ్ ఉంటుంది.