![Allu Aravind plans next with Boyapati Srinu and Akkineni hero](https://blr1.digitaloceanspaces.com/assets.telugu/wp-content/uploads/2025/02/Allu-Aravind-plans-next-with-Boyapati-Srinu-and-Akkineni-hero.jpg)
టాలీవుడ్‌లో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Srinu) మరో క్రేజీ ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతున్నట్లు టాక్ వస్తోంది. ప్రస్తుతం అఖండ 2 పై ఫోకస్ పెట్టిన బోయపాటి, ఆ సినిమా తర్వాత ఏ హీరోతో పని చేస్తాడనే విషయంలో ఇంకా క్లారిటీ లేదు. అయితే గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ (Allu Aravind) మాత్రం బోయపాటిని అక్కినేని నాగచైతన్య తో (Naga Chaitanya) కాంబినేషన్‌లో తీసుకురావాలని భావిస్తున్నట్లు సమాచారం. నాగచైతన్య ఇప్పటికే గీతా ఆర్ట్స్‌తో రెండు సినిమాలు చేసాడు.
Allu Aravind
100% లవ్ (100% Love) , తండేల్ (Thandel) రెండు హిట్ మూవీస్ కావడంతో మూడో సినిమా కూడా అదే బ్యానర్‌లో సెటప్ అవ్వాలని నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. అయితే, ఈసారి రొమాంటిక్ లవ్ స్టోరీలు కాకుండా, పక్కా మాస్ ఎంటర్‌టైనర్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారని టాక్. గతంలో చైతన్య మాస్ సినిమాలు చేసినా, బోయపాటి రేంజ్‌లో ఇంకా ఫుల్ కమర్షియల్ మూవీ చేయలేదు. ఇటీవల ఒక ప్రెస్ మీట్‌లో అల్లు అరవింద్ (Allu Aravind), నాగచైతన్యతో సరదాగా మాట్లాడినప్పుడు, “మనం మంచి యాక్షన్ సినిమా ప్లాన్ చేస్తున్నామని చెప్పలేదా?” అంటూ చెప్పిన మాట ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.
ఇది యాదృచ్ఛికంగా వచ్చిన డైలాగ్ కాదని, దీని వెనుక ఏదో స్కెచ్ ఉన్నట్టు అనిపిస్తోంది. చైతన్య కూడా తండేల్ తర్వాత భోగవల్లి ప్రసాద్ నిర్మాణంలో ఓ థ్రిల్లర్ మూవీ చేయబోతున్నాడు. ఆ ప్రాజెక్ట్ పూర్తి అయ్యేలోపు, బోయపాటి తన అఖండ 2 ప్రాజెక్ట్ పూర్తి చేస్తే, ఈ క్రేజీ కాంబో సెటప్ అయ్యే అవకాశముంది. చైతన్య కెరీర్‌లో క్లాస్, రొమాంటిక్ సినిమాలు ఎక్కువగా ఉన్నా, మాస్ జానర్‌పై కూడా అతడికి ఆసక్తి ఉంది.
జోష్ (Josh), ధడ (Dhada), వెంకీ మామ (Venky Mama) లాంటి కొన్ని మాస్ మసాలా మూవీస్ చేసినా, బోయపాటి లాంటి ఉరమాస్ డైరెక్టర్‌తో కలిసి పని చేయడం చైతన్యకు ఫుల్ రఫ్ అండ్ టఫ్ ఇమేజ్ తీసుకురావడానికి చక్కటి అవకాశం. పైగా బోయపాటి, మాస్ హీరోలకు మాస్ హిట్స్ ఇచ్చిన ట్రాక్ రికార్డ్ ఉన్న దర్శకుడు. మరి, ఈ క్రేజీ కాంబో ఫైనల్ అవుతుందా? లేదా అనేది తెలియాలి అంటే మరికొంత కాలం ఆగాల్సిందే.