
అక్కినేని నాగార్జున (Nagarjuna) తదుపరి ప్రాజెక్ట్ ఎవరితో ఉంటుందనేది ఇప్పటికీ సస్పెన్స్‌గానే ఉంది. కుభేర (Kubera) పూర్తయింది, కూలీ (Coolie) షూటింగ్ జరుపుకుంటోంది, కానీ సోలో సినిమాగా ఎలాంటి ప్రాజెక్ట్‌ను ఎంపిక చేసుకున్నారనేది ఆయన ఇప్పటికీ అధికారికంగా వెల్లడించలేదు. గత కొంతకాలంగా తమిళ దర్శకుడు నవీన్‌తో సినిమా ఉంటుందని ప్రచారం జరిగినా, ఇంకా దాని గురించి క్లారిటీ రాలేదు. దీంతో నాగ్ తన తదుపరి ప్రాజెక్ట్‌పై గట్టిగా ఆలోచిస్తున్నారని అనిపిస్తోంది. ఇదిలా ఉంటే, తాజా సమాచారం ప్రకారం యువ దర్శకుడు మల్లిడి వశిష్ట (Mallidi Vasishta) నాగార్జునను కలిసి ఓ ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను వినిపించారని తెలుస్తోంది.
Nagarjuna
అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఇటీవల వీరి భేటీ జరిగిందట. వశిష్ట ప్రస్తుతం చిరంజీవి హీరోగా విశ్వంభర (Vishwambhara) చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా, ఆ సినిమా పూర్తికాగానే నాగ్‌తో కొత్త ప్రాజెక్ట్‌ను మొదలు పెట్టాలనే ఆలోచనలో ఉన్నారని టాక్. అయితే నాగార్జున ఈ కథను ఆసక్తిగా విన్నప్పటికీ, ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని సమాచారం. విశ్వంభర సినిమా షూటింగ్ ఇప్పటికే ముగింపు దశకు చేరుకుంది. ఈ ప్రాజెక్ట్‌లో భారీ స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్ ఉండటంతో, దాని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఎక్కువ సమయం తీసుకోనుంది.
అయితే ఈ గ్యాప్‌లో వశిష్ట కొత్త కథలపై పనిచేస్తున్నారని, నాగార్జున కోసం ఓ ప్రత్యేకమైన కథను సిద్ధం చేశారని తెలుస్తోంది. ఇది రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లా కాకుండా, సోషల్ ఫాంటసీ కాన్సెప్ట్‌తో, వశిష్ట స్టైల్‌లోనే గ్రాండ్ స్కేల్‌లో ఉండే కథగా చెబుతున్నారు. ఇప్పుడు చూస్తే టాలీవుడ్‌లో సీనియర్ హీరోలలో వెంకటేష్ (Venkatesh), నాగార్జున మాత్రమే కొత్త ప్రాజెక్ట్‌ల కోసం అందుబాటులో ఉన్నారు. బాలయ్య (Nandamuri Balakrishna) వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో, ప్రస్తుతం వశిష్ట దృష్టి నాగార్జున మీదే ఉందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
నాగ్ కూడా ప్రస్తుతం ఓ ఫ్రెష్ కాంప్లెక్స్ కథ కోసం వెయిట్ చేస్తున్నారని, ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే చివరి నిర్ణయం మాత్రం రెండు నెలల పాటు ఆలస్యం కావొచ్చని తెలుస్తోంది. మొత్తానికి, విశ్వంభర తర్వాత వశిష్ట ప్యాన్ ఇండియా స్థాయిలో మరో ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించేందుకు రెడీగా ఉన్నారు. నాగార్జున గ్రీన్ సిగ్నల్ ఇస్తే, ఇది అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై నిర్మితమయ్యే భారీ సినిమా కావొచ్చు. మరి, ఈ ప్రాజెక్ట్ ఫైనల్ క్లారిటీ ఎప్పుడు వస్తుందో చూడాలి.