![Kingdom following Pushpa](https://blr1.digitaloceanspaces.com/assets.telugu/wp-content/uploads/2025/02/Kingdom-following-Pushpa.jpg)
‘రంగస్థలం’ (Rangasthalam) తర్వాత ‘పుష్ప’ (Pushpa) సినిమా చేశాడు సుకుమార్ (Sukumar). వాస్తవానికి మధ్యలో మహేష్ తో సినిమా అనుకున్నాడు.కానీ స్టోరీ సెట్ అవ్వలేదు. దీంతో మహేష్ తో సినిమా వర్కౌట్ అవ్వదు అని భావించి అల్లు అర్జున్ వద్దకు వెళ్ళాడు. ‘శేషాచలం అడవుల నేపథ్యం.. ముఖ్యంగా ఎర్రచందనం స్మగ్లింగ్’ ఈ పాయింట్లు మాత్రమే చెప్పారు. అది అల్లు అర్జున్ కు (Allu Arjun) నచ్చింది. తర్వాత తన టీంతో కథ డెవలప్ చేశారు. స్క్రిప్ట్ పనులు కంప్లీట్ అయిన వెంటనే షూటింగ్ మొదలుపెట్టారు.
Kingdom
కానీ ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయ్యేసరికి 3 గంటల ఫుటేజీ వచ్చేసింది. దీంతో ‘పుష్ప ది రైజ్’ గా ఫస్ట్ హాఫ్ ని రిలీజ్ చేశారు. సెకండాఫ్ కథ కూడా 2 సినిమాలకి తగ్గట్టు వచ్చింది. ‘పుష్ప 2’ (Pushpa 2) కూడా సెకండాఫ్ లో ఫస్ట్ హాఫ్ అని ఇటీవల సుకుమార్ చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. సరిగ్గా ఇప్పుడు విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) సినిమా విషయంలో కూడా ఇదే జరుగుతున్నట్టు స్పష్టమవుతుంది.
విషయంలోకి వెళితే.. విజయ్ దేవరకొండ హీరోగా ‘కింగ్డమ్’ (Kingdom) అనే సినిమా రూపొందుతుంది. ఇది కూడా మొదట ఒక సినిమాగానే మొదలుపెట్టారు. కానీ తర్వాత ఫస్ట్ హాఫె రెండున్నర గంటలు దాటేస్తుందట. దీంతో దీన్ని కూడా రెండు పార్టులుగా రిలీజ్ చేస్తున్నారు. మొదటి భాగం మే 30న విడుదల కాబోతుంది.
నిన్ననే టీజర్ కూడా రిలీజ్ చేశారు. ఎన్టీఆర్ (Jr NTR) దీనికి వాయిస్ ఓవర్ అందించడం జరిగింది. టీజర్ చాలా బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ అన్నీ బాగా కుదిరాయి. ‘టాక్సీ వాలా’ (Taxiwaala) తర్వాత విజయ్ కి సరైన హిట్టు పడలేదు. ‘కింగ్డమ్’ ఇతనికి మంచి హిట్టు ఇచ్చేలా కనిపిస్తోంది. ఏమో అల్లు అర్జున్ లానే పాన్ ఇండియా స్టార్ అయిపోయినా ఆశ్చర్యం లేదు.