
సినిమా హిట్ అవ్వాలంటే కేవలం కంటెంట్ మాత్రమే కాదు, సరైన సమయం కూడా కీలకం. ఈ విషయం ఇప్పుడు ఛావా (Chhaava) మూవీకి గట్టిగా రుజువైంది. విక్కీ కౌశల్ (Vicky Kaushal) ప్రధాన పాత్రలో నటించిన ఈ హిస్టారికల్ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ దగ్గర సునామీ సృష్టిస్తోందంటే.. దానికి కారణం కంటెంట్ తో పాటు మేకర్స్ తీసుకున్న ఒక సరికొత్త డిసిషన్ అని ట్రేడ్ అనలిస్టులు చెబుతున్నారు. మూవీ అనౌన్స్ చేసినప్పటి నుంచి మంచి హైప్ ఉన్నా, మొదట మేకర్స్ 2024 డిసెంబర్ 6 ను రిలీజ్ డేట్ గా ఫిక్స్ చేశారు.
Chhaava
కానీ అనూహ్యంగా పుష్ప 2 (Pushpa 2: The Rule) కూడా అదే డేట్ కు విడుదల కావడం ఖరారైంది. రెండు పాన్ ఇండియా బిగ్ బడ్జెట్ సినిమాలు ఒకే రోజు రావడం వల్ల కలెక్షన్స్ పంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇదే సమయంలో ఛావా మేకర్స్ తగిన నిర్ణయం తీసుకున్నారు. వారు సినిమాను 2025 ఫిబ్రవరి 14కి వాయిదా వేశారు. వాలెంటైన్ డే, లాంగ్ వీకెండ్ కావడంతో, సినిమాకు పర్ఫెక్ట్ విండో దొరికింది. ఈ నిర్ణయమే మూవీ సక్సెస్ లో కీలకంగా మారింది.
పెద్ద పోటీ లేకపోవడం, విన్నర్ గా నిలిచే పాజిషన్ రావడంతో, ఛావా ఒక్క వారం లోనే 300 కోట్లకు పైగా వసూలు చేసింది. సినిమా కంటెంట్ పక్కాగా ఉండటంతో పాటు, ఈ స్మార్ట్ మూవ్ కూడా కలిసొచ్చింది. ఇప్పుడు విక్కీ కౌశల్ యాక్టింగ్, రష్మిక (Rashmika Mandanna) ఎమోషనల్ పెర్ఫార్మెన్స్, అక్షయ్ ఖన్నా (Akshaye Khanna) విలన్ రోల్ పై ప్రశంసలు కురుస్తున్నాయి.
మరోవైపు పుష్ప-2 కూడా 1850 కోట్ల కు పైగా వసూలు చేసి సక్సెస్ అయ్యింది. ట్రేడ్ అనలిస్టుల ప్రకారం, ఒకే సమయానికి విడుదల అయితే రెండు సినిమాలు నష్టపోయేవి. కానీ మేకర్స్ కచ్చితమైన నిర్ణయం వల్ల ఛావా ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. సమయానుకూలమైన ఆ ఒక్క స్టెప్.. సినిమా హిట్ కి బలమైన బూస్ట్ ఇచ్చింది.