![Chiranjeevi's shocking decision on politics](https://blr1.digitaloceanspaces.com/assets.telugu/wp-content/uploads/2025/02/Chiranjeevis-shocking-decision-on-politics.jpg)
మెగాస్టార్ చిరంజీవి ఈరోజు బ్రహ్మానందం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా గెస్ట్ గా వచ్చారు. ఈ సందర్భంగా ఆయన స్పీచ్ లో భాగంగా కొన్ని విషయాలపై క్లారిటీ కూడా ఇచ్చారు. చిరంజీవి మాట్లాడుతూ.. ” ఈ మధ్య ఎక్కువ నేను ఈవెంట్లలో కనిపిస్తున్నాను.. ఓవర్ ఎక్స్ పోజర్ అయిపోతుంది అని కొంతమంది అనుకుంటున్నారు. అయితే ఎంత బయటకి కనిపించినా గ్లామర్ తగ్గదు.. దాని ఫ్లేవర్ బయటకి వెళ్తుంది అంతే.
Chiranjeevi, Pawan Kalyan
నా మిత్రుడు, నా శిష్యుడు లాంటి వ్యక్తి బ్రహ్మానందం కొడుకు అంటే నా బిడ్డతో సమానం. నా ప్రజన్స్ అనేది బిడ్డల సినిమాలకు ఉపయోగపడుతుంది అంటే.. నేను వస్తాను. నేను సినిమా చూడమని చెబుతున్నా అంటే జనాలకి కూడా ఒక నమ్మకం ఉంటుంది. ఈ మధ్య ప్రమోషన్ అనేది ఒక సినిమాకి చాలా ముఖ్యం అని సంక్రాంతికి వస్తున్నాం తో అనిల్ రావిపూడి ప్రూవ్ చేశాడు.
ఎక్కడ చూసినా ఆ సినిమా బాగా కనిపించింది. వెంకటేష్ కూడా హుషారుగా ప్రమోట్ చేశాడు. అందువల్ల ఆ సినిమాకి వెళ్లాలని అంతా భావించారు. అందుకే ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది” అంటూ వరుస ఈవెంట్లలో అతను కనిపించడానికి గల కారణాలు చెప్పిన చిరు ఆ తర్వాత ఒక సంచలన ప్రకటన చేశారు.
‘నేను ఈ మధ్య రాజకీయ నాయకులను కలుస్తున్నాను ‘ మళ్ళీ రాజకీయాల్లోకి వెళ్తాడా? అని కొందరు అనుకుంటున్నారు. నేను ఇక రాజకీయాల్లోకి వెళ్లను వాటికి నేను చాలా దూరం. అందుకు జనసేన ఉంది. నా తరఫున ప్రజలకి సేవ చేయడానికి పవన్ కళ్యాణ్ ఉన్నాడు’ అని కూడా చిరంజీవి క్లారిటీ ఇచ్చారు.