![Devi Sri Prasad musical comeback with Thandel](https://blr1.digitaloceanspaces.com/assets.telugu/wp-content/uploads/2025/02/Devi-Sri-Prasad-musical-comeback-with-Thandel.jpg)
ఇటీవల కాలంలో దేవీ శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) మ్యూజిక్ పై విపరీతమైన చర్చ జరుగుతోంది. ఒకప్పుడు మ్యూజికల్ బ్లాక్‌బస్టర్లకు మారుపేరైన దేవీ, ఇటీవలి సినిమాల్లో కొంత బ్యాక్‌ఫుట్‌లోకి వెళ్లాడనే టాక్ వినిపించింది. ఎప్పుడూ దేవీతోనే ముందుకు వెళ్లే సుకుమార్ సైతం పుష్ప 2 (Pushpa 2 The Rule) బీజీఎం కోసం వేరే ఆప్షన్ కూడా పరిశీలించడం ఆశ్చర్యాన్ని కలిగిచింది. ఈ పరిణామాల మధ్య దేవీ మళ్లీ తన సత్తా నిరూపించుకుంటాడా? అన్న ప్రశ్న నెలకొంది. ఇలాంటి సమయంలో తండేల్ (Thandel) ఆల్బమ్‌తో దేవీ శ్రీ ప్రసాద్ మరోసారి తన సక్సెస్ రేంజ్ చూపించాడు.
Devi Sri Prasad
బుజ్జితల్లి, నమో నమః, హైలెస్సా లాంటి పాటలు ఒక్కోకటిగా హిట్ అవుతూ, ఆల్బమ్‌ను మ్యూజికల్ బ్లాక్‌బస్టర్‌గా మార్చేశాయి. రిలీజ్ తర్వాత థియేటర్‌లోనూ దేవీ మ్యాజిక్ కొనసాగుతూ ప్రేక్షకులకు ఊపు తెప్పిస్తోంది. థియేటర్లో ప్రతీ హై మోమెంట్‌కి దేవీ బీజీఎం కిక్కిస్తోందని ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. ఈ విజయంతో పాటు దేవీ మ్యూజిక్ గురించి బన్నీ చెప్పిన మాటలు మరోసారి హైలైట్ అయ్యాయి.
తండేల్ మొదటిసారి ప్లాన్ చేస్తున్నప్పుడు, దేవీతో మ్యూజిక్ చేయాలా? వేరొకరిని తీసుకోవాలా? అనే డిస్కషన్ జరిగింది. అప్పుడే బన్నీ మాత్రం ఈ ప్రాజెక్ట్‌కు దేవీ శ్రీ ప్రసాదే బెస్ట్ అని, అతడే చేయాలని అల్లు అరవింద్‌కి (Allu Aravind) సూచించాడు. ఇప్పుడు థియేటర్‌లో ప్రేక్షకుల స్పందన చూస్తే బన్నీ(Allu Arjun) ఫెయిత్ వృథా కాలేదని తెలుస్తోంది. సినిమాకు ఎంతటి కథ ఉన్నా, మ్యూజిక్ క్లిక్కవ్వకుంటే ప్రేక్షకులకు కనెక్ట్ కావడం కష్టమే. తండేల్ విషయంలో దేవీ బీజీఎం ఆడియన్స్‌ను కొత్త స్థాయికి తీసుకెళ్లింది.
సినిమా చూసిన ప్రేక్షకులందరూ మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ, దేవీ తిరిగి తన పాత ఊపుని తెచ్చుకున్నాడని కామెంట్ చేస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద ఓ మంచి హిట్ సాధించడంతో పాటు దేవీ కెరీర్‌లో ఇదో పవర్‌ఫుల్ మ్యూజికల్ కంబ్యాక్‌గా నిలిచిపోనుంది.