
సంక్రాంత్రి సినిమాలైన ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) ‘డాకు మహారాజ్'(Daaku Maharaaj) ‘సంక్రాంతి వస్తున్నాం'(Sankranthiki Vasthunam).. తర్వాత బాక్సాఫీస్ వద్ద కొంచెం బెటర్ గా సందడి చేసిన సినిమా ‘తండేల్’ (Thandel) అనే చెప్పాలి. ఆ మధ్యలో వచ్చిన సినిమాలు.. దాని తర్వాత వచ్చిన ‘లైలా’ (Laila) ‘బ్రహ్మానందం’ (Brahma Anandam) వంటి సినిమాలు చేతులెత్తేశాయి. అయితే ఈ వారం కూడా 4,5 సినిమాలు రిలీజ్ అయ్యాయి. కానీ వీటిలో దేనికీ కూడా బజ్ లేదు..! కానీ అన్నిటికీ పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.
Harish Shankar
బ్రహ్మాజీ (Brahmaji) ప్రధాన పాత్రలో రూపొందిన ‘బాపు’ (Baapu), ధనరాజ్ (Dhanraj)- సముద్రఖని (Samuthirakani)..ల ‘రామం రాఘవం'(Ramam Raghavam), ధనుష్ (Dhanush) డైరెక్ట్ చేసిన ‘జాబిలమ్మ నీకు అంత కోపమా'(Jaabilamma Neeku Antha Kopama) ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) హీరోగా నటించిన ‘ రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్'(Return of the Dragon) .. ఇలా అన్నిటికీ మంచి టాక్ వచ్చాయి. కానీ టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద తెలుగు సినిమాలకంటే.. తమిళ సినిమాలకే ఆదరణ ఎక్కువగా కనిపిస్తుంది. చాలా చోట్ల ‘బాపు’ షోలు క్యాన్సిల్ అయ్యాయి.
దాదాపు 60 శాతం ‘రామం రాఘవం’ కి కూడా అదే పరిస్థితి. కానీ ‘డ్రాగన్’ ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ సినిమాలకి బుకింగ్స్ పర్వాలేదు అనిపించాయి.వాస్తవానికి మొదటి రోజు వాటికి సాదా సీదా ఓపెనింగ్స్ మాత్రమే వచ్చాయి. కానీ పాజిటివ్ టాక్ హెల్ప్ తో రెండో రోజు అడ్వాన్స్ బుకింగ్స్ బాగానే ఉన్నాయి. ముఖ్యంగా ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ ఈ వీకెండ్ విన్నర్ గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. తప్పేమీ లేదు. అన్ని సినిమాలు ఆడాలి..! ప్రేక్షకులు అన్ని సినిమాలు చూడాలి.
కానీ తమిళ సినిమాలతో సమానంగా మంచి టాక్ తెచ్చుకున్న తెలుగు సినిమాలను తెలుగు ప్రేక్షకులు పట్టించుకోకపోవడం చాలా ఘోరం. ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో హరీష్ శంకర్ (Harish Shankar) వంటి టాప్ డైరెక్టర్ ‘తెలుగులో తీసిన సినిమాలు తప్ప మీరు అన్ని సినిమాలు చూస్తారు కదా’ అని ఊరికే అనలేదు. అదే తమిళ జనాలు అయితే.. పక్క భాషల్లో ఎంత టాప్ స్టార్ సినిమా వచ్చినా.. మొదట వాళ్ళ సినిమాకే ఓటేస్తారు. కానీ మన తెలుగులో సమానత్వం కూడా కనిపించడం లేదు.