
టాలీవుడ్‌లో మే నెల బాక్సాఫీస్ దగ్గర ఆసక్తికర పోటీ మొదలవనుంది. నాని (Nani) ‘హిట్ 3’ (HIT 3) విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ‘కింగ్ డమ్’ (Kingdom) సినిమాలు నాలుగు వారాల గ్యాప్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈ రెండు సినిమాల మీద అభిమానులలో ఇప్పటికే హైప్ తారస్థాయికి చేరింది. హిట్ ఫ్రాంచైజ్ నుంచి వస్తున్న మూడో భాగం కావడంతో నాని ఫ్యాన్స్ హిట్ 3 సూపర్ హిట్ అవుతుందని నమ్ముతున్నారు. ఇక గౌతమ్ తిన్ననూరి (Gowtam Naidu Tinnanuri) దర్శకత్వం వహిస్తున్న కింగ్ డమ్ టీజర్ విడుదలైనప్పటి నుంచి, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కూడా ఇదే పెద్ద హిట్ అవుతుందనే ధీమా వ్యక్తం చేస్తున్నారు.
HIT3 vs Kingdom:
మొదటగా, హిట్ 3 టీజర్ విషయానికి వస్తే, నాని లాఠీ పట్టుకుని పవర్‌ఫుల్ లుక్‌లో కనిపించడం, ఆ యాక్షన్ ప్యాక్డ్ సీన్స్ చూసిన ప్రేక్షకులు సూపర్ రెస్పాన్స్ ఇచ్చారు. టీజర్ 24 గంటలలోనే 16 మిలియన్ వ్యూస్‌ను దాటింది. ఈ రేంజ్‌లో బజ్ వస్తే, సినిమాకు బిగ్ ఓపెనింగ్స్ ఖాయం అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. శైలేష్ కొలను (Sailesh Kolanu) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ క్రైమ్ థ్రిల్లర్‌లో నాని అర్జున్ సర్కార్‌గా చాలా పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తాడని టాక్.
హిట్ ప్రాంచైజ్‌లో ఇది మూడో సినిమా కావడం, ఫ్రాంచైజ్‌కు ఇప్పటికే స్ట్రాంగ్ ఫాలోయింగ్ ఉండటంతో, హిట్ 3 హిట్ అవ్వడం గ్యారెంటీ అంటున్నారు నాని ఫ్యాన్స్. అదే సమయంలో, కింగ్ డమ్ టీజర్ కూడా రౌడీ హీరో ఫ్యాన్స్‌లో అంచనాలను పెంచేసింది. గౌతమ్ తిన్ననూరి సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కావడం, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నాగవంశీ స్వయంగా కేజీఎఫ్ రేంజ్ సినిమా అని చెప్పడం సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది.
విజయ్ దేవరకొండ పోలీస్ గెటప్‌లో కనిపించడం, బ్యాక్‌డ్రాప్ సీరియస్‌గా ఉండడం ఆడియన్స్‌లో క్యూరియాసిటీని పెంచాయి. కింగ్ డమ్ టీజర్‌కు కూడా 15 మిలియన్ వ్యూస్ రావడం ఈ సినిమా బజ్ ఎలాంటి స్థాయిలో ఉందో చెప్పకనే చెబుతోంది. రిలీజ్ డేట్స్ విషయానికి వస్తే, హిట్ 3 మే 1న, కింగ్ డమ్ మే 30న విడుదల కాబోతున్నాయి. నాలుగు వారాల గ్యాప్ ఉండటం వల్ల రెండు సినిమాలకు స్పష్టమైన మార్కెట్ ఉంటుంది.
అయితే, ఎవరి సినిమా హిట్టవుతుందో అన్న ఉత్కంఠ మాత్రం తగ్గడం లేదు. హిట్ 3 ఇప్పటికే రెండుసార్లు హిట్ సిరీస్ కావడంతో మినిమం గ్యారెంటీ అని నాని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, విజయ్ ఫ్యాన్స్ కింగ్ డమ్ అతని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అవుతుందని సోషల్ మీడియాలో హడావుడి చేస్తున్నారు. మొత్తానికి, ఈ రెండు సినిమాలు కూడా హీరోల కెరీర్ ను మరో లెవెల్ కు తీసుకెల్లేవే. కాబట్టి బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్‌లో దుమ్ము దులిపి, ఎవరి సినిమా కలెక్షన్లలో పైచేయి సాధిస్తుందో చూడాలి.