
యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR), కేజీఎఫ్ (KGF), ‘సలార్’లో (Salaar) వంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబినేషన్ అనగానే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఒకవైపు తారక్ మాస్ యాటిట్యూడ్, మరోవైపు ప్రశాంత్ నీల్ మార్క్ స్క్రీన్ ప్లే కలిస్తే, సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందో ఊహించుకోవడం కష్టమే. కానీ, తాజాగా లీకైన బ్యాక్‌డ్రాప్, బడ్జెట్ డీటైల్స్ ఈ సినిమాను మరింత హైప్‌లోకి తీసుకెళ్లేశాయి. RRR దేవర (Devara) మూవీస్ తో వరుస హిట్స్ జాబితాలో నిలిచిన తారక్, ప్రస్తుతం వార్ 2 షూటింగ్‌ను ముగిస్తూనే ఉన్నారు.
Jr NTR, Prashanth Neel:
హృతిక్ రోషన్‌తో (Hrithik Roshan) కలసి బాలీవుడ్‌లో తన సత్తా చూపిస్తున్న ఆయన, ఆ ప్రాజెక్ట్ పూర్తి చేసిన వెంటనే ప్రశాంత్ నీల్ సినిమాకి జంప్ కానున్నారు. కానీ, ఈ సినిమా కేవలం యాక్షన్ ఎంటర్‌టైనర్ మాత్రమే కాదు, గోల్డెన్ ట్రయాంగిల్ మాఫియా నేపథ్యంలో రా, ఇంటెన్స్ స్టోరీ అని లేటెస్ట్ లీక్స్ చెబుతున్నాయి. ఈ గోల్డెన్ ట్రయాంగిల్ అంటే ఏమిటంటే.. 1950ల నుంచి ఈశాన్య మయన్మార్, వాయువ్య థాయిలాండ్, ఉత్తర లావోస్ ప్రాంతాలు కలిపి ప్రపంచవ్యాప్తంగా డ్రగ్స్ హబ్‌గా మారిన ప్రదేశం.
అక్కడ హెరాయిన్, ఓపియం లాంటి నల్లమందు తాయారు చేసి, ప్రపంచవ్యాప్తంగా సరఫరా చేసే గ్యాంగ్‌లు పుట్టుకొచ్చాయి. వీటి మధ్య వలస వచ్చిన ఒక సామాన్యుడు, ఎలాంటి పరిస్థితుల్లోనైనా నిలబడే లీడర్‌గా ఎదిగాడు అనే కథే ఈ సినిమా. ఎన్టీఆర్ ఇందులో పవర్‌ఫుల్ మాఫియా లీడర్‌గా కనిపించనున్నారట. ప్రారంభంలో సామాన్య వ్యక్తిగా స్టార్ట్ అయ్యే హీరో, గోల్డెన్ ట్రయాంగిల్‌లో ఉన్న గ్యాంగ్‌లను తన స్టైల్లో నిర్వీర్యం చేస్తాడు. ఈ పాత్రలో బ్లడ్ షేడ్, రివేంజ్, లీడర్‌షిప్ అన్ని అంశాలు ఉంటాయట.
ఇటీవల లీకైన సెట్స్ ఫోటోల్లో పాత అంబాసిడర్ కార్లు, సైకిళ్లు కనిపించడం కూడా ఈ 1970ల బ్యాక్‌డ్రాప్‌ను స్పష్టంగా చూపిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్ట్ కోసం ఏకంగా ₹360 కోట్ల బడ్జెట్ కేటాయించారు. ఇది ఎన్టీఆర్ కెరీర్‌లోనే హయ్యెస్ట్ బడ్జెట్ ప్రాజెక్ట్. టాప్ టెక్నీషియన్స్, హాలీవుడ్ స్థాయి విజువల్స్, గ్రాండ్ సెట్స్ అన్ని కూడా ఈ సినిమా యాక్షన్ జోనర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లబోతోందట.
ఇంకా షూటింగ్ స్టార్ట్ కాకుండానే ఈ స్థాయి హైప్ రావడం, ట్రేడ్ వర్గాల్లోనూ బాగా చర్చనీయాంశంగా మారింది. కేవలం తెలుగులోనే కాదు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళంతోపాటు ఇంటర్నేషనల్ మార్కెట్‌లోనూ ఈ మూవీ భారీ కలెక్షన్లు రాబడుతుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గాసిప్స్ ప్రకారం, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 1000 కోట్ల క్లబ్‌లోకి చేరడం ఖాయమని చెప్పుకుంటున్నారు.