పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ OG (OG Movie) . యంగ్ డైరెక్టర్ సుజిత్ (Sujeeth) టేకింగ్‌లో ముంబై మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో ఓ పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా, పవన్ కెరీర్‌లో మరో విభిన్నమైన ప్రాజెక్ట్‌గా నిలవబోతోంది. ఇప్పటికే వచ్చిన టీజర్, లుక్ పోస్టర్స్ సినిమాపై అంచనాలను ఆకాశానికెత్తేశాయి. పవన్ స్టైల్, డైలాగ్ డెలివరీ, మాస్ అప్పీల్ అన్నీ OGలో మరింత మాస్ లెవెల్‌లో ఉంటాయని టాక్.
షూటింగ్ దాదాపు 60% పూర్తయింది. పవన్ ప్రస్తుతం రాజకీయ కార్యక్రమాలతో బిజీగా ఉన్నప్పటికీ, మిగిలిన పార్ట్ షూట్ కోసం ప్రత్యేకమైన షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. వచ్చే కొన్ని నెలల్లో పూర్తిగా OG పై ఫోకస్ పెట్టి షూటింగ్‌ను ర్యాపిడ్‌గా కంప్లీట్ చేయాలని టీమ్ స్ట్రాటజీ సిద్ధం చేసుకుంటోంది. అండర్‌వరల్డ్ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే ఈ కథలో పవన్ కళ్యాణ్ డాన్ రోల్ పోషిస్తున్నట్లు సమాచారం. ఇది అభిమానులకు పూనకాలు తెప్పించే రేంజ్‌లో ఉండబోతోందని చిత్రబృందం అంటోంది.
ఇక టెక్నికల్ సైడ్‌లో OG హై లెవెల్ మేకింగ్‌ను ప్రామిస్ చేస్తోంది. తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవబోతోంది. మరోవైపు, రవికె చంద్రన్ (Ravi K. Chandran) విజువల్స్ సినిమాకు గ్రాండ్ లుక్‌ను అందించనున్నాయి. ఈ సినిమా ఇండస్ట్రీలోనే కొత్త మైలురాయిగా నిలవనుందని మేకర్స్ చెబుతున్నారు. పాన్ ఇండియా రేంజ్‌లో ప్రొడక్షన్ వాల్యూస్ హై లెవెల్‌లో ఉంటాయని, బాలీవుడ్‌లోనూ భారీ స్థాయిలో ప్రదర్శించేందుకు ప్లాన్స్ వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక OG నుంచి మరో మేజర్ అప్‌డేట్ ఫిబ్రవరి లేదా మార్చిలో రానుందనే టాక్ నడుస్తోంది.
టీజర్ రిలీజ్ చేస్తారా? లేదా స్పెషల్ వీడియోతో ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తారా? అన్నది ఇంకా క్లారిటీ రాలేదు. కానీ ఈసారి ప్రొమోషన్స్ మాత్రం ఊహించిన దానికంటే మాస్ లెవెల్‌లో జరగబోతున్నాయని సమాచారం. పవన్ కల్యాణ్ హరి హర వీరమల్లు (Hari Hara Veera Mallu) పూర్తి చేసిన వెంటనే, మిగిలిన OG షూట్‌లో జాయిన్ కానున్నారు. ఈ ప్రాజెక్ట్ 2025 చివర్లో థియేటర్లలోకి రావచ్చని ఊహాగానాలు ఉన్నాయి. అయితే, అధికారిక రీలీజ్ డేట్‌పై ఇంకా స్పష్టత రాలేదు.