![Pattudala Movie 6 Days Total Collections](https://blr1.digitaloceanspaces.com/assets.telugu/wp-content/uploads/2025/02/Pattudala-Movie-6-Days-Total-Collections.jpg)
తమిళ స్టార్ హీరో అజిత్ (Ajith Kumar) , త్రిష (Trisha) జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘పట్టుదల'(Pattudala). మగిల్ తిరుమేని (Magizh Thirumeni) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ షార్జా ( Arjun Sarja), రెజీనా (Regina Cassandra)..లు నెగిటివ్ రోల్స్ చేశారు. మొదటి రోజు ఈ సినిమాకి నెగిటివ్ టాక్ రావడంతో ఓపెనింగ్స్ కూడా సో సో గానే నమోదయ్యాయి. సినిమా చాలా స్లోగా సాగడం, హీరోయిజం వంటివి లేకపోవడం, అజిత్ లుక్స్ కూడా సెట్ అవ్వకపోవడం వల్ల ఆడియన్స్ పెదవి విరిచారు.
Pattudala Collections:
మొదటి 3 రోజులు పర్వాలేదు అనిపించిన ఈ సినిమా 4వ రోజు నుండి డ్రాప్ అవుతూ వస్తోంది. నిన్న కూడా చాలా చోట్ల షోలు క్యాన్సిల్ అయ్యాయి. ఈవెనింగ్ షోలు ఓ మోస్తరు కలెక్షన్స్ ని సాధించాయి. ఒకసారి 6 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 0.46 cr |
సీడెడ్ | 0.21 cr |
ఉత్తరాంధ్ర | 0.40 cr |
ఈస్ట్ | 1.07 cr |
‘పట్టుదల'(తెలుగు) కి రూ.3.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.3.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 6 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.1.07 కోట్ల షేర్ ను రాబట్టింది . బ్రేక్ ఈవెన్ కి ఇంకా రూ.2.43 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మరో 2 రోజుల్లో ‘లైలా’ వంటి కొత్త సినిమాలు రిలీజ్ కానున్నాయి. సో ఎంత రాబట్టుకున్నా.. ఈ 2 రోజులే..!