ప్రకాష్ రాజ్ (Prakash Raj) .. పరిచయం అవసరం లేని పేరు. ఇప్పుడు అంతా పాన్ ఇండియా సినిమాల గురించి చెప్పుకుంటున్నాం కదా. మొదటి పాన్ ఇండియా ఆర్టిస్ట్ గురించి చెప్పుకోవాలి అంటే ప్రకాష్ రాజ్ గురించే చెప్పుకోవాలి. అంతకు ముందు కూడా పాన్ ఇండియా లెవెల్లో నటించిన ఆర్టిస్టులు ఉన్నప్పటికీ.. ప్రకాష్ రాజ్ ను ఓన్ చేసుకున్నట్టు వేరే ఆర్టిస్ట్ ను ఓన్ చేసుకోలేదు అనే చెప్పాలి. ఎలాంటి పాత్రలో అయినా పరకాయ ప్రవేశం చేసే నటుడు ప్రకాష్.
Pony Verma
తనకు ఇచ్చిన పాత్రకి వందకు వంద శాతం న్యాయం చేస్తాడు. తండ్రిగా చేసినా, విలన్ గా చేసినా, క్యారెక్టర్ గా చేసినా ప్రకాష్ మార్క్ కచ్చితంగా కనిపిస్తుంది అనడంలో సందేహం లేదు. ఇక ప్రకాష్ రాజ్ పర్సనల్ లైఫ్ కూడా అందరికీ తెలిసిందే. ప్రకాష్ రాజ్ బెంగళూరు , హుబ్లీకి చెందిన వ్యక్తి అనే సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఆయన తెలుగులోనే ఎక్కువగా స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నారు. ప్రకాష్ రాజ్ ముందుగా శ్రీహరి భార్య డిస్కో శాంతి సోదరి అయినటువంటి లలిత కుమారిని 1994 లో వివాహం చేసుకున్నారు.
అయితే తర్వాత వీరి మధ్య మనస్పర్థలు రావడంతో 2009 లో విడాకులు తీసుకున్నారు. అటు తర్వాత కొరియోగ్రాఫర్ అయినటువంటి పోనీ వర్మని వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకి వేదాంత్ అనే కొడుకు కూడా ఉన్నాడు. అతనికి నిన్నటితో 9 ఏళ్ళు పూర్తయ్యాయట. అలాగే ఆమె (Pony Verma) బేబీ బంప్ ఫోటోలను కూడా షేర్ చేసింది. అవి ప్రస్తుతం వైరల్ గా మారాయి.
View this post on Instagram