ఒక సినిమా మరో సినిమా ఛాన్స్‌ను ఇప్పిస్తుంది అని చెబుతుంటారు. అయితే ఆ తొలి సినిమా హిట్ అయి ఉండాలి. కానీ ఓ డిజాస్టర్ సినిమా మరో ఛాన్స్ ఇచ్చింది అంటే నమ్ముతారా? ఏమో తెలుగు, తమిళ్‌కు పెద్దగా తేడా తెలియని ప్రముఖ తెలుగు హీరోయిన్ పూజా హెగ్డే (Pooja Hegde) ఇలా ఛాన్స్ సంపాదించిందట. ఆ డిజాస్టర్‌లోని కొన్ని సన్నివేశాల్లో ఆమె నటన చూసి ఛాన్స్ ఇచ్చారట. అది కూడా ఆమె సెకండ్ ఇన్నింగ్స్‌లో.
Pooja Hegde
తెలుగులో ఓ సినిమా చేసి ఐరెన్ లెగ్ అనిపించుకుని, బాలీవుడ్ వెళ్లిపోయి అక్కడా అదే పేరు తెచ్చుకున్న హీరోయిన్ పూజా హెగ్డే. అయితే తిరిగి టాలీవుడ్‌కి వచ్చి వరుస విజయాలతో స్టార్ స్టేటస్ సంపాదించుకుంది. అగ్ర హీరోల సినిమాల్లో ఛాన్స్‌లు వచ్చాయి. అయితే కథల ఎంపికలో జాగ్రత్త లేకపోవడంతో సినిమాలు పోయి మళ్లీ ఐరెన్ లెగ్ అయిపోయింది. చాలా నెలలు ఖాళీగా ఉన్న పూజ.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది.
అందులో ముఖ్యమైన సినిమా ‘రెట్రో’ (Retro) . తనకు తొలి సినిమా (మూగముడి / మాస్క్) ఛాన్స్ ఇచ్చిన తమిళంతోనే ఆమె రెండో ఇన్నింగ్స్ స్టార్ట్ అవుతోంది. ఆ సినిమానే ‘రెట్రో’. ఈ సినిమాలో అవకాశం రావడానికి దర్శకుడు కార్తిక్ సుబ్బరాజు (Karthik Subbaraj) ‘రాధే శ్యామ్’ (Radhe Shyam) సినిమా చూడటమే అని అంటున్నారు. ‘రాధే శ్యామ్’ సినిమాలో తన లుక్, పర్ఫామెన్స్‌ని చూసి కార్తిక్ సుబ్బరాజు ‘రెట్రో’సినిమాకు సరిపోతానని తీసుకున్నారని పూజ (Pooja Hegde) చెబుతోంది. అయితే ఆ సినిమాలో ఆమె లుక్ విషయంలో విమర్శలు వచ్చాయి.
లుక్ ఏం బాలేదని, ముఖం అంతగా ఎట్రాక్టివ్‌గా లేదు అని కామెంట్లు వచ్చాయి. అయితే కేవలం టీజర్ చూసి అలా అనడం సరికాదు, సినిమాలో ఆమె పాత్ర చాలా బాగుంటుంది అని ఆమె టీమ్ చెబుతోంది. ఇక పూజ సినిమాల సంగతి చూస్తే.. సూర్య (Suriya) ‘రెట్రో’తో పాటు విజయ్ ‘జన నాయగన్’లో నటిస్తోంది. హిందీలో వరుణ్ ధావన్ (Varun Dhawan) సినిమా ‘హే జవానీ తో ఇష్క్ హోనా హై’లో ఓ హీరోయిన్‌గా కనిపించనుంది.