
టాలీవుడ్‌లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా నిలుస్తున్న టాప్ ప్రాజెక్టు.. మహేష్ బాబు (Mahesh Babu) -రాజమౌళి (S. S. Rajamouli) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న SSMB 29. ప్రపంచ స్థాయిలో ఈ సినిమాను రూపొందిస్తోన్న జక్కన్న, ఈసారి అడ్వెంచర్ బ్యాక్‌డ్రాప్‌లో కథను సిద్ధం చేశారని వార్తలు గట్టిగానే ఉన్నాయి. కానీ షూటింగ్ మొదలై చాలా రోజులు అవుతున్నా, ఒక్క లుక్ కూడా బయటకు రాకపోవడంతో ఫ్యాన్స్ ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారు. రాజమౌళి స్టైల్ తెలిసినవాళ్లకు ఇది కొత్తేమీ కాదు. కానీ, ఇలాంటి సీక్రసీ మధ్య ఒక ఆసక్తికరమైన చర్చ నెట్టింట్లో హాట్ టాపిక్ అయ్యింది.
Rajamouli:
ప్రియాంక చోప్రా (Priyanka Chopra) క్యాస్టింగ్‌కి సంబంధించింన రూమర్స్ బాగానే వైరల్ అవుతున్నాయి. మొదట్లో ఆమె పేరు ప్రచారంలోకి వచ్చినప్పుడు, అది కేవలం పుకారే అని అంతా భావించారు. కానీ, రాజమౌళి సోషల్ మీడియాలో మహేష్ ఫొటో పెట్టినప్పటి ప్రియాంక చోప్రా కామెంట్ పెట్టడంతో అందరూ నమ్మారు. అయితే, ఇక్కడ అసలు కథ మొదలైంది. ప్రియాంక రోల్ చాలా చిన్నదని, కానీ ఆమె డిమాండ్ చేసిన పారితోషికం మాత్రం భారీగా ఉందని టాక్.
ఆమె కోసం ప్రత్యేకంగా 35 కోట్లు చెల్లిస్తున్నారని, అంతే కాకుండా స్క్రిప్ట్‌లో మార్పులు కూడా చేస్తున్నారట. ఇంతకుముందు, రాజమౌళి తన సినిమాల కోసం ఎవరితోనూ రాజీ పడని దర్శకుడిగా పేరొందారు. బాహుబలి (Baahubali), ఆర్ఆర్ఆర్ (RRR) సినిమాల సమయంలో కూడా, ఆయన డిమాండ్ చేసినవారిని పక్కన పెట్టి, తన ప్లాన్ ప్రకారమే సినిమాను పూర్తి చేశారు. కానీ, ఇప్పుడు ప్రియాంక కోసం రాజమౌళి తగ్గిపోతున్నారా? అంటే, కొంతమంది నెటిజన్లు “ఇది అసలు నమ్మేలా లేదు” అని అంటున్నారు.
ఇక రాజమౌళి స్క్రిప్ట్ విషయంలో చాలా కచ్చితమైన వ్యక్తి. ఆయన ప్లాన్‌లో ఎవరు మార్పులు కోరుకున్నా, అది కథకు అవసరమైతేనే ఒప్పుకుంటారు. కేవలం ఒక నటుడి కోసం కధను మార్చటం రాజమౌళి హిస్టరీలోనే లేదని అంటున్నారు. అందుకే, ప్రియాంక చోప్రా కోసం స్క్రిప్ట్ మార్చేశారనే వార్తలను ఫ్యాన్స్ అంతగా పట్టించుకోవడం లేదు. మొత్తానికి, SSMB 29 గురించిన ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియదు.
కానీ రాజమౌళి గురించి తెలుసుకున్నవారు, ఇలాంటి డిమాండ్స్‌కు ఆయన తగ్గే వ్యక్తి కాదని గట్టిగా నమ్ముతున్నారు. ఏదైనా, ఫైనల్ క్లారిటీ వచ్చే వరకు ఈ రూమర్స్ నడుస్తూనే ఉంటాయి. సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉండగా, చిన్న వార్త కూడా హైప్‌ను మరింత పెంచుతుంది. కానీ, జక్కన్న స్క్రిప్ట్ మార్చాడా? లేదా? అనేది తుది వాస్తవం ఇంకా వెలుగు చూడాల్సి ఉంది.