‘కొమరం పులి’ (Komaram Puli) ‘ఖలేజా’ (Khaleja) వంటి భారీ బడ్జెట్ సినిమాలు నిర్మించిన సింగనమల రమేష్ బాబు (Singanamala Ramesh Babu).. ఆ సినిమాల తర్వాత ఇండస్ట్రీకి దూరమైన సంగతి తెలిసిందే. 2011 టైంలో ఆయన అరెస్ట్ అవ్వడం, తర్వాత జైలు శిక్ష అనుభవించడం వంటి విషయాలు కూడా అందరికీ తెలిసిందే. అయితే 14 ఏళ్ళ పాటు ఆ కేసు వల్ల ఇతను కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చిందట. మొత్తానికి జనవరి 31న సింగనమల రమేష్ బాబుపై ఉన్న కేసును కొట్టేయడం జరిగిందట.
Ramesh Babu
దీంతో ఈరోజు ఆయన ప్రెస్ మీట్ పెట్టి.. తిరిగి సినిమాల్లోకి రాబోతున్నట్టు ప్రకటించారు. ఈ క్రమంలో మహేష్ బాబు (Mahesh Babu), పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పై ఆయన చేసిన కామెంట్స్ అందరికీ షాకిస్తున్నాయి. సింగనమల రమేష్ బాబు మాట్లాడుతూ.. “‘ఖలేజా’ ‘కొమరం పులి’ సినిమాల వల్ల రూ.100 కోట్లు నష్టపోయాను. ఈ రోజుల్లో ఒక పెద్ద సినిమాకి అంటే రాజమౌళి (S. S. Rajamouli), సుకుమార్ (Sukumar) వంటి పెద్ద దర్శకులు తీసే సినిమాలకి 3 ఏళ్ళు టైం పడుతుంది అనుకుంటే అనుకోవచ్చు.
ఆ రోజుల్లో నాకు తెలిసింది.. ఓ సినిమాని 6 నెలలు,9 నెలలు, 12 నెలల్లో తీస్తారు అని..! అంతకు మించి ఆ రోజుల్లో టైం తీసుకునేవారు కాదు. కానీ దురదృష్టవశాత్తు ‘ఖలేజా’ ‘కొమరం పులి’ సినిమాలకి 3 ఏళ్ళు టైం పట్టింది. నిర్మాతలు కనుక ఈ మాటలు వింటే.. వాళ్ళకి నా బాధ అర్థమవుతుంది. ఆ 3 ఏళ్ళు తెచ్చిన బడ్జెట్ కి ఇంట్రెస్ట్..లు కట్టాల్సిందే. ఆఫీస్..లు, మైంటెనెన్సు..లు వంటివి తప్పవు.
పవన్ కళ్యాణ్ గారు ప్రజారాజ్యం పార్టీ పనుల్లో ఉండటం వల్ల ‘కొమరం పులి’ సినిమా ఆలస్యం అయ్యింది. సరే ఆ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. భారీగా నష్టాలు వచ్చాయి. అయినా సరే హీరోలు మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ వంటి వాళ్ళు ఆదుకోలేదు. కనీసం ‘ఎలా ఉన్నావ్ రమేష్?’ అని మాట్లాడింది కూడా ఇన్నేళ్ళలో ఒక్కసారి కూడా లేదు” చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ కి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.
ఖలేజా, కొమరంపులి సినిమాల వల్ల 100 కోట్ల రూపాయల వరకు నష్టపోయాను.!#Kaleja #Komarampuli #Pawankalyan #Maheshbabu pic.twitter.com/Dji0daqmGz
— Filmy Focus (@FilmyFocus) February 5, 2025
సినిమాలు ప్లాప్ అయ్యి నష్టాలు వచ్చాక మహేష్, పవన్.. పట్టించుకోలేదు, కనీసం నన్ను పలకరించలేదు.!#Pawankalyan #Maheshbabu pic.twitter.com/gaJQd1IXTf
— Filmy Focus (@FilmyFocus) February 5, 2025