
‘లవ్ టుడే’ ’ (Love Today) ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) లేటెస్ట్ మూవీ ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ గత వారం అంటే ఫిబ్రవరి 21న రిలీజ్ అయ్యింది. ‘ఓ మై కడవులే'(తెలుగులో ‘ఓరి దేవుడా) ఫేమ్ అశ్వథ్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ఇది. మొదటి షోతోనే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో మొదటి రోజు బుకింగ్స్ కొంచెం స్లోగా ఉన్నా.. రెండో రోజు నుండి పికప్ అయ్యింది. వీకెండ్ బాగా కలెక్ట్ చేసిన ఈ సినిమా.. వీకెండ్ తర్వాత కూడా స్టడీగానే కలెక్ట్ చేస్తుంది.తమిళంలో కూడా స్ట్రాంగ్ గా ఉంది.
Return of the Dragon Collections:
ఒకసారి 5 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 1.52 cr |
సీడెడ్ | 0.40 cr |
ఆంధ్ర(టోటల్) | 1.25 cr |
ఏపీ + తెలంగాణ(టోటల్) | 3.17 cr |
‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ (Return of the Dragon ) చిత్రానికి తెలుగులో రూ.3 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.3.5 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 5 రోజుల్లో ఈ చిత్రం రూ.3.17 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.5.3 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.0.33 కోట్ల షేర్ ను రాబట్టాలి. మరో రెండు రోజులు ఇలాగే స్టడీగా రాణిస్తే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి.