
తెలుగమ్మాయి రీతూ వర్మ (Ritu Varma) కెరీర్ ప్రారంభంలో ‘బాద్ షా’ (Baadshah) వంటి సినిమాల్లో సైడ్ క్యారెక్టర్లు వేసినా.. తర్వాత హీరోయిన్ గా మారి ‘ప్రేమ ఇష్క్ కాదల్’ వంటి సినిమాల్లో నటించింది. ‘పెళ్ళిచూపులు’ (Pelli Choopulu) ‘ఒకే ఒక జీవితం’ (Oke Oka Jeevitham) వంటి హిట్లు ఈమె ఖాతాలో ఉన్నాయి. స్కిన్ షోకి దూరంగా ఉన్నా.. ఎప్పటికప్పుడు నాని వంటి పెద్ద హీరోల సినిమాల్లో అవకాశాలు సంపాదిస్తూనే ఉంది. తమిళంలో కూడా విశాల్ (Vishal) సరసన ‘మార్క్ ఆంటోనీ’ (Mark Antony) వంటి సినిమాల్లో నటిస్తోంది.
Ritu Varma
కంటెంట్ ఉన్న సినిమాల్లో మెయిన్ హీరోయిన్ గా ఇప్పటికీ ఛాన్సులు దక్కించుకుంటూనే ఉంది. అయితే సరైన సక్సెస్ మాత్రం ఎందుకో అందుకుని స్టార్ హీరోయిన్ గా ఎదగలేకపోతుంది ఈ అమ్మడు. ఈ మధ్య చూసుకుంటే ‘శ్వాగ్’ (Swag) అనే సినిమాలో రీతూ వర్మ చాలా మంచి పాత్ర పోషించింది. కానీ ఆ సినిమా డిజాస్టర్ అవ్వడంతో ఆమె కష్టం వేస్ట్ అయిపోయినట్టు అయ్యింది. ఇక ఇటీవల ‘మజాకా’ (Mazaka) వచ్చింది. ఇందులో ఆమె సందీప్ కిషన్ కి జోడీగా నటించింది.
ఇందులో కూడా రీతూ మెయిన్ రోల్ చేసింది. కథలో అత్యంత కీలకమైన పాత్ర ఇది. క్లైమాక్స్ లో వచ్చే కిచెన్ సీన్లో రీతూ చాలా చక్కగా చేసింది. రావు రమేష్ వంటి గొప్ప నటుడితో కలిసి అలా నటించడం అంటే మాటలు కాదు. కానీ ఎందుకో ఈ సినిమా కూడా మంచి టాక్ తెచ్చుకోలేదు. రీతూ వర్మ నటన గురించి కానీ క్యారెక్టర్ గురించి కానీ ఆడియన్స్ ఎక్కువగా మాట్లాడుకోవడం లేదు.