
‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam) సినిమా చుట్టూ గత కొన్ని రోజులుగా రకరకాల వార్తలు వస్తున్నాయి. సినిమా టీమ్ నుండి, టీవీ – ఓటీటీ హక్కులు పొందిన టీమ్‌ల నుండి ఎలాంటి సమాచారం లేకపోయినా.. రకరకాల వార్తలు అయితే వచ్చాయి. తాజాగా వాటన్నింటికీ క్లారిటీ వచ్చేసింది. దీనికి తోడు సినిమా రీమేక్‌కి సంబంధించిన ప్రచారం కూడా జోరుగా సాగింది. ఈ విషయంలో కూడా కొత్త పోస్టర్‌తో క్లారిటీ వచ్చింది. వెంకటేష్ (Venkatesh) , అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబినేషన్ లో వచ్చిన సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’.
Sankranthiki Vasthunam
సంక్రాంతికి వచ్చిన ఈ సినిమా (Sankranthiki Vasthunam) ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు అందుకుని బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ టైమ్ మొదలైంది అని ఫ్లోలో రాసేయొచ్చు. కానీ ఇక్కడే ట్విస్ట్ వచ్చింది. ‘అవును ముందు టీవీ కదా’ ని అంటారేమో. ఆ రూమర్డ్ ట్విస్ట్‌కి ఇంకో లైన్ యాడ్ అయింది. అదే టీవీ + ఓటీటీ.
అవును ఈ సినిమాను ఒకేసారి టీవీ, ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారట. ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam) సినిమా డిజిటల్, శాటిలైట్ హక్కులను జీ గ్రూప్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అందుకే మార్చి 1న సాయంత్రం 6 గంటలకు సినిమాను వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్, ఓటీటీ ప్రీమియర్‌గా టెలీకాస్ట్ / స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. అలాగే సినిమాను తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళంలో భాషల్లో రిలీజ్ చేస్తామని తేల్చారు.
అంటే ఓటీటీ ముందు, టీవీ ముందు అనే ప్రశ్న ఇక్కడ లేదు. రెండింటిలో ఒకేసారి చూడొచ్చన్నమాట. ఓటీటీలు ఆధిపత్యం చలాయిస్తున్నాయి అని అనుకుంటున్న ఈ రోజుల్లో టీవీ + ఓటీటీ రావడం మంచి స్టెప్పే అని చెప్పాలి. మిగిలిన సినిమాలు ఈ ఫార్మాట్‌ను ఫాలో అయితే ఓటీటీల ఆధిపత్యానికి అడ్డుకట్ట వేయొచ్చేమో. ఇక ఈ సినిమా హిందీలోకి తీసుకెళ్తున్నారని వస్తున్న వార్తలూ ఈ పోస్టర్‌తో ఆగిపోతాయి.