
‘హిట్’ ఫ్రాంచైజీలో భాగంగా వచ్చిన ‘హిట్’ (HIT) ‘హిట్ 2’ (HIT 2) మంచి విజయాలు అందుకున్నాయి. వాటి తర్వాత ‘హిట్ 3’ (HIT 3) తెరకెక్కుతుంది. ‘వాల్ పోస్టర్ సినిమా’ బ్యానర్ పై నాని, ప్రశాంతి తిపిర్నేని (Prashanti Tipirneni) కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శైలేష్ కొలను (Sailesh Kolanu) ఈ 3వ భాగానికి కూడా దర్శకత్వం వహిస్తున్నాడు. నాని ఇందులో హీరోగా నటిస్తున్నాడు. కేజీఎఫ్ (KGF) బ్యూటీ శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) ఇందులో హీరోయిన్. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా మే 1న సమ్మర్ కానుకగా రిలీజ్ కాబోతోంది.
Sarkaar’s Laathi: HIT 3 Teaser Review:
ఈరోజు అనగా ఫిబ్రవరి 24న నాని పుట్టినరోజు కావడంతో ‘హిట్ 3’ నుండి టీజర్ ని వదిలారు. ‘హిట్ 3’ టీజర్ విషయానికి వస్తే.. ఇది 1:44 నిమిషాల నిడివి కలిగి ఉంది. జమ్మూ కాశ్మీర్ బ్యాక్ డ్రాప్లో.. అభిలాష్(శ్రీనాథ్ మాగంటి) వాయిస్ ఓవర్లో టీజర్ మొదలైంది. వరుసగా ఆ ప్రదేశంలో సీరియల్ కిల్లింగ్స్ జరుగుతుంటాయి. చంపేసిన తర్వాత తలక్రిందులుగా శవాలను వేలాడదీసి చెట్లకు కట్టేసి వెళ్లిపోతుంటుంది విలన్ గ్యాంగ్.
ఆ కేసు కాంప్లికేట్ అవ్వడంతో అర్జున్ సర్కార్(నాని) కి అప్పగిస్తారు. అతను మహా కోపిష్టి. అందుకే ‘ఇతని లాఠీకి దొరికే వాళ్ళ పరిస్థితి తలుచుకుంటే భయమేస్తుంది’ అంటూ పై ఆఫీసర్ గా చేసిన రావు రమేష్ (Rao Ramesh) పాత్రతో చెప్పించారు. ఈ సినిమాలో నాని మునుపెన్నడూ చూడనంత వయొలెంట్ గా కనిపిస్తున్నాడు. టెక్నికల్ గా కూడా ‘హిట్ 3’ టీజర్ బాగుంది. మీరు కూడా ఓ లుక్కేయండి :