![Court issues arrest warrant against Sonu Sood](https://blr1.digitaloceanspaces.com/assets.telugu/wp-content/uploads/2025/02/Court-issues-arrest-warrant-against-Sonu-Sood.jpg)
ప్రముఖ నటుడు సోనూసూద్‌కు (Sonu Sood) అరెస్ట్ వారెంట్ జారీ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.ఒక కేసులో సోనూసూద్ వాంగ్మూలం ఇవ్వాల్సి వస్తుంది. అయితే అందుకు ఆయన కోర్టుకు హాజరు కాలేదు. దీంతో పంజాబ్లోని లుధియానా కోర్టు సోనూసూద్ కి అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసింది. వెంటనే సోనూసూద్‌ను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టాలని అతనికి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసినట్టు కూడా సమాచారం. గతంలోకి వెళితే.. లుథియానాకు చెందిన రాజేశ్ ఖన్నా అనే అడ్వాకేట్.. మోహిత్ శర్మ అనే వ్యక్తిని రిజికా కాయిన్ ఇన్వెస్ట్‌మెంట్లో భాగంగా రూ.10 లక్షలు ఫ్రాడ్ చేశాడట.
Sonu Sood
దీంతో మోహిత్ శర్మ పంజాబ్, లూథియానా కోర్టులో కేసు వేయడం జరిగింది. ఇందుకు సాక్షిగా ఉన్న సోనూసూద్ కూడా కోర్టుకు హాజరు కావాలని నోటీసులు పంపించింది న్యాయస్థానం. సోనూసూద్ కోర్టుకు హాజరు కాకపోవడం వల్ల కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినట్లు అయ్యింది. అందుకే అరెస్ట్ వారెంట్ ఇష్యు అయ్యింది అని స్పష్టమవుతుంది. మరోపక్క సోనూసూద్ విలన్ గా ఎన్ని సినిమాలు చేసినా..
కోవిడ్ టైంలో అతను చేసినా సేవా కార్యక్రమాల వల్ల అతను రియల్ హీరో అయిపోయాడు. సోనూసూద్ అంటే ప్రజలకు మంచి ఒపీనియన్ ఉంది. అది నార్త్ లో అయినా.. సౌత్లో అయినా..! అందుకే అతనికి హీరోగా చేసే అవకాశాలు కూడా లభిస్తున్నాయి. ఇటీవల అతను హీరోగా రూపొందిన ‘ఫతే’ అనే సినిమా కూడా రిలీజ్ అయ్యింది. దానికి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి.