
సినీ పరిశ్రమలో ఇటీవల ఫేక్ పోస్టర్లు సృష్టించిన అల్లకల్లోలం. అంతా.. ఇంతా కాదు. ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam) ‘డాకు మహారాజ్’ (Daaku Maharaaj) వంటి సినిమాల కలెక్షన్స్ పోస్టర్స్ పై నెగిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ‘గేమ్ ఛేంజర్’ కలెక్షన్స్ పోస్టర్స్ గురించి వార్స్ ఎక్కువగానే జరిగాయి. అయినా ‘తండేల్’ (Thandel) సినిమాకి వంద కోట్లు అంటూ పోస్టర్లు పడ్డాయి. సరే ఆ విషయాలు పక్కన పెట్టేస్తే.. ఈ కలెక్షన్స్ పోస్టర్స్ గురించి తాజాగా హీరో సందీప్ కిషన్ (Sundeep Kishan) తన అభిప్రాయాన్ని తెలియజేశాడు.
Sundeep Kishan
సందీప్ కిషన్ (Sundeep Kishan) మాట్లాడుతూ….”రూ.100 కోట్లు పోస్టర్ వేస్తే 60 శాతం జనాలు నమ్ముతారు. 40 శాతం మాత్రం ‘ఇది టూ మచ్ రోయ్’ అంటాం. 60 శాతం జనాలు అయితే నమ్ముతున్నారు కదా. మిగిలిన వాళ్లలో రూ.100 కోట్లు కాకపోయినా రూ.80 కోట్లు చేసి ఉంటుందిలే…, కాదు అంటే సగం అయినా చేసి ఉంటుంది కదా.అది కూడా మంచి నంబరే కదా అనే ఫీలింగ్ వస్తుంది.
అప్పుడు సోషల్ మీడియాలో మనం ఆ విషయం చెప్పినప్పుడు ఎవరైనా నెగిటివ్ గా చెబితే రియాక్ట్ అవ్వడానికి 100 మంది ఉంటారు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే..! అదేంటంటే.. ఒకటి మన గురించి నిజం చెప్పేవాళ్ళు అయినా ఉండాలి. లేదు.. అంటే ‘ఇది నిజం’ అని చెప్పి వంద మందిని నమ్మించే వాళ్లయినా ఉండాలి. ఇండస్ట్రీలో ఇది ఉంది. మార్కెట్లో ఇదే రన్ అవుతుంది” అంటూ చెప్పుకొచ్చాడు.
PR లేకపోతే జనాలు మనల్ని గుర్తుపెట్టుకోరు
నిజం చెప్పేవాళ్లయినా కావాలి.. లేదంటే ఒక అబద్ధాన్ని నిజం అని నమ్మించే నేర్పు అయినా తెలిసి ఉండాలి pic.twitter.com/eQvYEL6P0P
— Telugu360 (@Telugu360) February 21, 2025