![Thandel Movie 5 Days Total Worldwide Collections](https://blr1.digitaloceanspaces.com/assets.telugu/wp-content/uploads/2025/02/Thandel-Movie-5-Days-Total-Worldwide-Collections.jpg)
అక్కినేని నాగ చైతన్య(Naga Chaitanya) , సాయి పల్లవి (Sai Pallavi) జంటగా నటించిన ‘తండేల్’ (Thandel) సినిమా ఫిబ్రవరి 7న రిలీజ్ అయ్యింది. చందూ మొండేటి (Chandoo Mondeti) డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) సంగీతం మొదటి నుండి బాగా ప్లస్ అయ్యింది. అన్ని పాటలు చార్ట్ బస్టర్స్ అవ్వడం వల్ల సినిమాకి హైప్ వచ్చింది. బన్నీ వాస్ (Bunny Vasu) రూ.90 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించారు. సహా నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) ప్రమోషన్స్ విషయంలో రాజీ పడలేదు.
Thandel Collections:
మొదటి రోజు ఈ సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో ఈ సినిమా నాగ చైతన్య కెరీర్లో హైయెస్ట్ ఓపెనింగ్స్ ను సాధించింది.అలాగే బ్రేక్ ఈవెన్ కూడా కంప్లీట్ అయ్యింది.ఒకసారి 5 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 13.15 cr |
సీడెడ్ | 4.09 cr |
ఉత్తరాంధ్ర | 4.32 cr |
ఈస్ట్ | 2.22 cr |
వెస్ట్ | 1.67 cr |
కృష్ణా | 1.79 cr |
గుంటూరు | 1.72 cr |
నెల్లూరు | 0.98 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 29.94 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 3.21 cr |
ఓవర్సీస్ | 3.95 Cr |
టోటల్ వరల్డ్ వైడ్ | 37.10 cr (షేర్) |
‘తండేల్’ (Thandel) చిత్రానికి రూ.35.7 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.36 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 5 రోజుల్లో ఈ సినిమా రూ.37.1 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా రూ.1.1 కోట్ల ప్రాఫిట్స్ తో క్లీన్ హిట్ గా నిలిచింది. గ్రాస్ పరంగా రూ.64 కోట్లు కొల్లగొట్టింది ఈ సినిమా.