![Thandel Movie First Review1](https://blr1.digitaloceanspaces.com/assets.telugu/wp-content/uploads/2025/02/Thandel-Movie-First-Review.jpg)
అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya) హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘తండేల్’ (Thandel) . సాయి పల్లవి (Sai Pallavi) హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని ‘గీతా ఆర్ట్స్’ బ్యానర్ పై బన్నీ వాస్ (Bunny Vasu) నిర్మిస్తుండగా.. అల్లు అరవింద్ (Allu Aravind)సమర్పకులుగా వ్యవహరించారు. దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) సంగీతంలో రూపొందిన ‘బుజ్జి తల్లి’ ‘హైలెస్సో’ ‘శివ శివ’ వంటి పాటలు చార్ట్ బస్టర్స్ అయ్యాయి. గ్లింప్స్ అలాగే ప్రమోషన్స్ లో భాగంగా వదిలిన ట్రైలర్ కానీ.. సూపర్ రెస్పాన్స్ ను దక్కించుకున్నాయి.
Thandel First Review:
దీంతో సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ‘తండేల్’ సినిమాపై నాగ చైతన్య అభిమానులు. అక్కినేని అభిమానులు చాలా హోప్స్ పెట్టుకున్నారు. ఈ సినిమాతో సూపర్ హిట్ కొట్టి.. వంద కోట్ల క్లబ్లో తమ అక్కినేని హీరో చేరాలని అంతా ఆశపడుతున్నారు. బుకింగ్స్ కూడా బాగానే ఉన్నాయి. ఆల్రెడీ సినిమాని టాలీవుడ్లోని కొంతమంది పెద్దలకి చూపించడం జరిగిందట. సినిమా చూశాక వారు తమ అభిప్రాయాన్ని వెల్లడించడం జరిగింది.
సినిమా 2 గంటల 32 నిమిషాల నిడివి కలిగి ఉందని అంటున్నారు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తో సినిమా మొదలవుతుందట. నాగ చైతన్య ఎంట్రీ సీన్ బాగుందని అంటున్నారు. రాజు అనే జాలరి పాత్రలో అతను జీవించేశాడట. కచ్చితంగా ఇది నాగ చైతన్య కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ అంటున్నారు. డైలాగ్ డెలివరీలో కూడా గత సినిమాలకంటే.. ఈ సినిమాలో బాగా వేరియేషన్ చూపించాడట. ఇక సాయి పల్లవి తన క్యూట్ లుక్స్ తో ప్రతి ఫ్రేమ్ కి అందం తీసుకొచ్చింది అంటున్నారు.
ఆమె నేచురల్ పెర్ఫార్మన్స్ కి మరోసారి అంతా ఫిదా అయిపోవడం ఖాయం అంటున్నారు. ఇంటర్వెల్ బ్లాక్ కూడా బాగా వచ్చిందట. హీరో అండ్ టీం పాకిస్థాన్ సైన్యానికి దొరికిపోయాక వచ్చే సన్నివేశాలు కొన్ని బాగా వర్కౌట్ అయ్యాయట. క్లైమాక్స్ సినిమాకు ప్రాణం అంటున్నారు. హీరో, హీరోయిన్లు కలిసే సన్నివేశాలు యూత్ కి అమితంగా నచ్చేస్తాయట. మరి మార్నింగ్ షోలు ముగిశాక ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి.