![Thandel movie budget and profit to get details](https://blr1.digitaloceanspaces.com/assets.telugu/wp-content/uploads/2025/02/Thandel-movie-budget-and-profit-to-get-details.jpg)
‘లవ్ స్టోరీ’ (Love Story) తర్వాత అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya), సాయి పల్లవి (Sai Pallavi) జంటగా నటించిన సినిమా ‘తండేల్’ (Thandel). చందూ మొండేటి డైరెక్ట్ చేసిన ఈ సినిమాని బన్నీవాస్ (Bunny Vasu) నిర్మించారు. అల్లు అరవింద్ (Allu Aravind) సహా నిర్మాతగా వ్యవహరించారు. దాదాపు రూ.90 కోట్ల బడ్జెట్ తో వారు ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) సంగీతంలో రూపొందిన పాటలు రిలీజ్ కి ముందు చార్ట్ బస్టర్స్ అయ్యాయి. సినిమాపై బజ్ పెంచడానికి అవి హెల్ప్ అయ్యాయి.
Thandel
ట్రైలర్ కూడా అంచనాలు పెంచింది. దీంతో ఈ సినిమాకి థియేట్రికల్ బిజినెస్ బాగానే జరిగింది. కంటెంట్ పై ఉన్న కాన్ఫిడెన్స్ తోనో ఏమో కానీ ఆంధ్రలో ఈ సినిమాకి ప్రభుత్వం అనుమతులతో టికెట్ రేట్లు కూడా పెంచుకున్నారు. ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్ ను ఒకసారి గమనిస్తే :
నైజాం | 10.00 cr |
సీడెడ్ | 5.00 cr |
ఉత్తరాంధ్ర | 6.00 cr |
ఈస్ట్ | 1.50 cr |
వెస్ట్ | 1.20 cr |
కృష్ణా | 1.50 cr |
గుంటూరు | 1.70 cr |
నెల్లూరు | 0.80 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 27.70 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 2.00 cr |
తమిళనాడు | 1.00 cr |
ఓవర్సీస్ | 5.00 cr |
టోటల్ వరల్డ్ వైడ్ | 35.70 cr (షేర్) |
‘తండేల్’ (Thandel) చిత్రానికి రూ.35.7 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.36 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. కొన్ని సెంటర్స్ లో అయితే నిర్మాతలు ఓన్ రిలీజ్ కూడా చేసుకుంటున్నారు. వాళ్ళ కాన్ఫిడెన్స్ ఎంత బలమైందో చూడాలి.