
అంకిత్ కొయ్య ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో’ (14 Days Girlfriend Intlo). శ్రియా కొంతం హీరోయిన్ గా చేసింది. ‘శ్రీ సత్య ఎంటర్టైన్మెంట్’ బ్యానర్ పై సత్య ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. శ్రీ హర్ష ఈ చిత్రానికి దర్శకుడు. ఆల్రెడీ ఈ చిత్రం నుండి స్నీక్ పీక్ రిలీజ్ అయ్యింది. దానికి ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించిన సంగతి తెలిసిందే.
14 Days Girlfriend Intlo Trailer
‘ఇంట్లో ఎవ్వరూ లేని టైంలో హీరో తన గర్ల్ ఫ్రెండ్ ఇంటికి వెళ్లడం.. అక్కడ అనుకోకుండా ఇరుక్కుపోవడం. ఈ క్రమంలో అతన్ని బయట పడేయటానికి వచ్చిన ఫ్రెండ్(వెన్నెల కిషోర్) కీ పడేయడం, తర్వాత అతను ఏమైంది?’ అనే సస్పెన్స్ తో స్నీక్ పీక్ ఎండ్ అయ్యింది. ఇక మార్చి 7న ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. ఈ క్రమంలో ట్రైలర్ ను కూడా వదిలారు.
’14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో’ (14 Days Girlfriend Intlo) ట్రైలర్ 2 నిమిషాల 10 సెకన్ల నిడివి కలిగి ఉంది. హీరో గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో ఇరుక్కున్న తర్వాత.. అతని ఫ్రెండ్ కీ పడేయడం.. ఆ తర్వాత అతను కూడా హీరో గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో ఇరుక్కుపోవడాన్ని చూపించారు. వెంటనే హీరోయిన్ ఫ్యామిలీ మెంబర్స్ ఆ ఇంటికి వచ్చేయడం.. వాళ్ళ కంట పడకుండా హీరో అనేక పాట్లు పడటాన్ని కూడా చాలా ఫన్నీ వేలో చూపించారు.
ట్రైలర్లో కూడా వినోదానికి పెద్దపీట వేశారు అని చెప్పాలి.ఈ సమ్మర్ కి.. అంటే మార్చి 7 కి థియేటర్లలో ఆడియన్స్ తో ఫుల్లుగా నవ్వించే విధంగా ఈ సినిమా ఉండబోతుంది అనే హోప్స్ ట్రైలర్ ఇచ్చింది. మీరు కూడా ఓ లుక్కేయండి :