
ఇప్పుడు ప్రశాంత్ వర్మ (Prasanth Varma), నాగ్ అశ్విన్ (Nag Ashwin)..ల గురించి ఇప్పుడు మనం ఎంత గొప్పగా చెప్పుకుంటున్నామో. ఒకప్పుడు కోడి రామకృష్ణ (Kodi Ramakrishna) అనే దర్శకుడి గురించి 10 రెట్లు గొప్పగా చెప్పుకునే వారు. ఆయన తీసిన ఆల్ టైం హిట్ సినిమాల్లో ‘దేవి’ ఒకటి. ఆ సినిమా రిలీజ్ అయ్యి నేటితో 26 ఏళ్లు పూర్తి కావస్తోంది. ఈ సందర్భంగా ‘దేవి’ (Devi) గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం రండి :
Devi
1) 1995 లో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి తో (Vijayashanti) ‘స్ట్రీట్ ఫైటర్’ అనే లేడీ ఓరియెంటెడ్ మూవీ చేశారు నిర్మాత ఎం.ఎస్.రాజు. బి.గోపాల్ (B. Gopal) దానికి దర్శకుడు. జయసుధ (Jayasudha), నాగబాబు (Nagendra Babu) వంటి వారు కూడా కీలక పాత్రలు పోషించారు. మినిమమ్ గ్యారంటీ కాంబినేషన్ ఇది. కానీ సినిమా జనాలకి నచ్చలేదు.. బాక్సాఫీస్ వద్ద కూడా నిలబడలేదు. ఈ సినిమా వల్ల యం.యస్.రాజు (M. S. Raju) చాలా నష్టపోయారు. అయితే గోడకు కొట్టిన బంతి మాదిరి ఆయన బౌన్స్ బ్యాక్ అవ్వడానికి ఎక్కువగా ఇష్టపడతారు. అందుకే తనకు ‘శత్రువు’ (Sathruvu) వంటి సూపర్ హిట్ ఇచ్చిన కోడి రామకృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేయాలని డిసైడ్ అయ్యారు.
2) ఈ క్రమంలో కొంతమంది పెద్ద హీరోలను అప్రోచ్ అయ్యారు. కానీ కోడి రామకృష్ణ ఆ టైంలో చేసిన ‘పెళ్ళి కానుక’ ‘డాడీ డాడీ’ వంటి సినిమాలు పెద్దగా ఆడలేదు. దీంతో ఆయన ఫామ్లో లేకపోవడం వల్ల పెద్ద హీరోలు ఎవ్వరూ ముందుకు రాలేదు. మరోపక్క ఆయన మొదలుపెట్టిన ‘అంజి’ (Anji) సినిమా కూడా హోల్డ్ లో పడింది. ఈ కారణాల వల్ల ‘అమ్మోరు’ స్టైల్లో ఓ లేడీ ఓరియెంటెడ్ కమ్ సోసియో ఫాంటసీ మూవీ చేయాలని అనుకున్నారు.
3) దీంతో కోడి రామకృష్ణ వద్ద ఉన్న ఒక లైన్ ని తన టీంతో డెవలప్ చేయడం మొదలుపెట్టారు. ఫైనల్ గా స్క్రిప్ట్ రెడీ అయ్యింది. ఇది స్టార్స్ తో చేస్తే బడ్జెట్ పెరిగిపోయే అవకాశం ఉంది అని భావించి.. కొంచెం సాదా సీదా ఆర్టిస్ట్..లతో చేద్దాం అని డిసైడ్ అయ్యారు.
4) అప్పటికే ‘ధర్మ చక్రం’ తో పాటు తెలుగులో పలు సినిమాల్లో నటించి పాపులర్ అయిన ప్రేమ (Prema) అనే కన్నడ నటిని మెయిన్ రోల్ కి తీసుకున్నారు. అలాగే మలయాళ నటుడు సిజుని హీరోగా తీసుకున్నారు. అలాగే మరో మలయాళ నటుడు పోలీస్ ఆఫీసర్ అయినటువంటి అబూ సలీంని విలన్ రోల్స్ కి తీసుకున్నారు. ఇతని లుక్ నిజంగానే ఆడియన్స్ ని భయపెట్టే విధంగా ఉంటుంది.
5) ఆ టైంలో టెక్నాలజీ పెద్దగా అందుబాటులో లేదు. అయినప్పటికీ ‘దేవి’ వంటి సినిమాని 33 రోజుల్లోనే కంప్లీట్ చేశారు. ఒకటి రెండు సెట్స్ వేసి.. కేవలం 4 షెడ్యూల్స్ లో సినిమాని కంప్లీట్ చేశారు కోడి రామకృష్ణ.
6) షూటింగ్ కంప్లీట్ అయ్యాక పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసం మరో 4 వారాలు టైం తీసుకున్నారు. మొత్తంగా 70 రోజుల్లోపే సినిమా మొత్తం కంప్లీట్ అయిపోయింది. 1998 డిసెంబర్లో సెట్స్ పైకి వెళ్తే.. 1999 మార్చి నాటికి సినిమాని రిలీజ్ చేసేశారు. ఇలాంటి సినిమాని ఇప్పుడు తీయమంటే ఫిలిం మేకర్స్ ఏళ్లకు ఏళ్లు తీస్తారు అనడంలో అతిశయోక్తి లేదు.
7) రూ.6 కోట్ల బడ్జెట్లో రూపొందిన ఈ సినిమా ఆ రోజుల్లోనే రూ.24 కోట్ల వరకు వసూళ్లు రాబట్టింది. తర్వాత శాటిలైట్ రైట్స్ ను కూడా భారీ రేటు పెట్టి కొన్నారు. అలా నిర్మాత యం.యస్.రాజు భారీ లాభాలు అందుకున్నారు.
8) ‘దేవి’ సినిమాతో శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) సంగీత దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఆ సినిమా పేరు అతని పేరులో భాగం అయిపోయింది. అలా దేవి శ్రీ ప్రసాద్ గా మారాడు. ఆ సినిమా టైంకి అతని వయసు కేవలం 19 ఏళ్ళు. అయినా సరే మంచి మ్యూజిక్ ఇచ్చాడు. సినిమా రిలీజ్ తర్వాత ఆడియో సేల్స్ కూడా పెరిగాయి.
9) అప్పటివరకు ఎన్ని తెలుగు సినిమాల్లో నటించినా.. ‘దేవి’ తర్వాత ప్రేమకి స్టార్ ఇమేజ్ వచ్చింది. తెలుగులో బోలెడన్ని ఆఫర్లు వచ్చాయి. కానీ కెరీర్ ను సరిగ్గా ప్లాన్ చేసుకోకపోవడంతో ఆమె ఎక్కువ కాలం నిలబడలేకపోయింది.
10) ‘దేవి’ తో వనితా విజయ్ కుమార్ (Vanitha Vijay Kumar) తెలుగు ప్రేక్షకులకి పరిచయమైంది. భక్తురాలి పాత్రలో ఆమె లుక్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పటి వనిత విజయ్ కుమార్ లుక్.. ‘దేవి’ లో వనితా లుక్ కి చాలా మార్పుని గమనించవచ్చు.