
హిందీలో బ్లాక్ బస్టర్ అయిన ‘ఛావా’ (Chhaava) సినిమాని తెలుగులో కూడా ఎగబడి చూస్తున్నారు. తెలుగులో ఈ సినిమా డబ్ అవ్వలేదు. ఒరిజినల్ వెర్షన్…నే తెలుగు ఆడియన్స్ తెగ చూసేస్తున్నారు. సో ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకూడదు అని భావించిన ‘గీతా ఆర్ట్స్’ సంస్థ తెలుగులో కూడా దీనిని డబ్ చేసేందుకు రెడీ అయ్యారు. మార్చి 7న ‘ఛావా’ ని తెలుగులో కూడా రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా ఓ ప్రమోషనల్ ఈవెంట్ ను కూడా బన్నీ వాస్ (Bunny Vasu) ఏర్పాటు చేయడం జరిగింది.
Allu Aravind
ఇందులో భాగంగా.. ఆయన మీడియాతో ‘క్యూ అండ్ ఎ’ లో కూడా పాల్గొన్నారు. రిపోర్టర్లు అడిగిన ప్రశ్నలకి శైలిలో చాలా కూల్ గా సమాధానాలు ఇచ్చారు బన్నీ వాస్. ఇదే క్రమంలో ఆయన.. ‘అల్లు అర్జున్ (Allu Arjun) ఈరోజు హైదరాబాద్ వచ్చారట కదా? మరి ఆయన నెక్స్ట్ ప్రాజెక్టు సంగతేంటి?’ అంటూ ఓ రిపోర్టర్ ప్రశ్నించారు. అందుకు బన్నీవాస్.. “ఆయన నెక్స్ట్ ప్రాజెక్టు ఏంటి అన్నది..ఆయన చెబితేనే కానీ మాకు క్లారిటీ లేదు.
ఇప్పటివరకు వెల్నెస్ సెంటర్ కి వెళ్లొచ్చారు” అంటూ సమాధానం ఇచ్చాడు. ఆ తర్వాత ‘అల్లు అరవింద్ గారు కూడా కేరళలో ఉన్న వెల్నస్ సెంటర్ కి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు’ అంటూ బన్నీ వాస్ చెప్పారు. కాసేపటికి బన్నీ వాస్ రియలైజ్ అయ్యి ‘కేరళలో ట్రీట్మెంట్ అంటే అల్లు అరవింద్ (Allu Aravind) గారికి ఏదో అయిపోయింది అని ప్రచారం చేసేస్తారేమో..! ఆయన బరువు తగ్గడం కోసం అక్కడి వెల్నెస్ సెంటర్ కి వెళ్లారు అంతే’ అంటూ క్లారిటీ ఇచ్చారు.