
సినిమా వాళ్ళకే కాదు సీరియల్స్ లో నటించే నటీనటులకు కూడా గట్టి డిమాండ్ ఉంటుంది. వీళ్ళను కూడా ఆడియన్స్ ఎక్కువగానే ఓన్ చేసుకుంటూ ఉంటారు. ఎక్కువగా సీరియల్స్ లో విలన్స్ అంతా లేడీస్ ఉంటారు అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆడదానికి ఆడదే శత్రువు అనే డెఫినిషన్ తో సీరియల్స్ సాగుతుంటాయి. ఇప్పుడు ఓ సీరియల్ విలన్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ‘కసౌతి జిందగీ కే’ అనే సీరియల్ అందరికీ గుర్తుండే ఉంటుంది.
Urvashi Dholakia
ఇందులో కోమోలికా బసు అనే పాత్ర బాగా పాపులర్. ఆ పాత్ర గురించి చెప్పగానే అందరికీ ఊర్వశి ధోలాకియా (Urvashi Dholakia) మైండ్లోకి వచ్చేస్తుంది. ఈ సీరియల్లో ఆమె పెద్ద బొట్టుకొని, పల్చటి చీరలు ధరించి చాలా గంభీరంగా కనిపిస్తుంది. సీరియల్ ఆరిస్టులు ఇలా కూడా ఉంటారా? అనే విధంగా ఓ ట్రెండ్ సెట్ చేసింది ఈమె. ఇదిలా ఉండగా.. ఈమె జీవితంలో చెప్పుకోలేనంత విషాదం ఉంది అనే సంగతి చాలా మందికి తెలీదు.
సీరియల్స్ లో అందరినీ భయపెట్టే విధంగా కనిపించే ఈమె (Urvashi Dholakia) నిజ జీవితంలో చాలా కష్టాలు పడింది. 16 ఏళ్లకే ఈమె పెళ్లి చేసుకోవడం, 17 ఏళ్ల తల్లి అవ్వడం జరిగింది. ఆ తర్వాత ఏడాదికే.. అంటే 18 ఏళ్లకే విడాకులు కూడా తీసుకోవాల్సిన పరిస్థితి ఎదుర్కొంది. ఈమెకు కవల పిల్లలు ఉన్నారు. వాళ్ళ పేర్లు సాగర్, క్షితిజ్. వీళ్ళే సర్వస్వంగా జీవిస్తున్న ఈమె.. వాళ్ళ కోసమే సినీ, టీవీ రంగంలో ఎక్కువ ప్రాజెక్టులు చేస్తున్నట్టు కూడా పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది.