
ఐటెం సాంగ్స్ & స్పెషల్ డ్యాన్స్ నెంబర్స్ & రొమాంటిక్ డ్యూయెట్స్ ను ఈమధ్య మన తెలుగు సినిమా దర్శకులు, కొరియోగ్రాఫర్లు తెరకెక్కిస్తున్న విధానం చూస్తుంటే క్రియేటివిటీ పేరుతో దిగజారుతున్నామేమో అనిపిస్తుంది. ముఖ్యంగా శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ ఈమధ్య చర్చనీయాంశంగా మారింది. “మిస్టర్ బచ్చన్”లో (Mr. Bachchan) పాటకే శేఖర్ మాస్టర్ & హరీష్ శంకర్ ను (Harish Shankar) దారుణంగా ట్రోల్ చేశారు జనాలు. కానీ.. ఆ సినిమా వరకు ట్రోలింగ్ మొత్తం హరీష్ శంకర్ మీదకు మళ్లిపోయింది.
Sekhar Master
కానీ.. మొన్నామధ్య వచ్చిన “డాకు మహారాజ్” (Daaku Maharaaj) సినిమాలోని “దబిడి దిబిడి” సాంగ్ కి లిరికల్ వెర్షన్ నుంచే ట్రోలింగ్ మొదలైంది. ఎమ్మెలే కూడా అయిన బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఓ హీరోయిన్ పిర్రల మీద బాదడం అనేది ఎవ్వరూ పాజిటివ్ గా తీసుకోలేకపోయారు. ఆ తర్వాత సినిమాలో ఆ స్టెప్స్ ను తీసేయడం జరిగింది. అప్పుడు కూడా శేఖర్ మాస్టర్ కంటే బాలయ్యనే ఎక్కువ ట్రోల్ చేశారు.
కానీ.. నిన్న విడుదలైన “అదిదా సర్ప్రైజు” పాటలో కేతిక శర్మ (Ketika Sharma) చేత చేయించిన స్టెప్ మాత్రం అస్సలు జీర్ణించుకోలేని స్థాయిలో ఉంది. ప్రత్యేకంగా కేతిక వేసుకున్న కాస్ట్యూమ్ కి ఆ స్టెప్.. ఊర్లలో జాతర్లప్పుడు ట్రాక్టర్ల మీద వేసే స్టెప్పులను తలపించింది. కాస్తో కూస్తో సెన్సిబిలిటీ ఉంటే ఈ తరహా స్టెప్పులు వేయించాల్సిన అవసరం ఉండదు. మరి శేఖర్ మాస్టర్ వరుసబెట్టి ఈ తరహా స్టెప్పులతో ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నాడో తెలియదు కానీ,
ఒక కొరియోగ్రాఫర్ గా అతడి స్థాయిని ఈ స్టెప్పులు కచ్చితంగా తగ్గిస్తున్నాయనో చెప్పాలి. మరి సినిమాకి అటెన్షన్ తీసుకురావడం కోసం కావాలనే మేకర్స్ ను ఒప్పించి మరీ శేఖర్ ఈ తరహా ఇబ్బందికరమైన స్టెప్పులు వేయిస్తున్నాడా లేక నిజంగానే అతడి క్రియేటివిటీనా అనేది తెలియదు కానీ.. మిగతా ఇండస్ట్రీల ముందు అనవసరంగా చీప్ అవుతున్నాం అనే విషయాన్ని గ్రహించకపోతే కష్టం.